సారూ..పట్టించుకోరా!

ABN , First Publish Date - 2022-07-16T16:26:26+05:30 IST

వారం రోజులు కురిసిన వర్షాలతో మహానగర రహదారుల డొల్లతనం మరోమారు బయటపడింది. రోడ్ల నిర్మాణం, మరమ్మతును పట్టించుకునే

సారూ..పట్టించుకోరా!



కథనం కలకలం

మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలు, వారి నియోజకవర్గాలు, నివసించే ప్రాంతాల్లోని రోడ్ల దుస్థితిని కళ్లకు కట్టేలా శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. కథనం చూసిన కొందరు ఎమ్మెల్యేలు.. వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులతో మాట్లాడారు. రోడ్ల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఇంకొందరు నిర్లక్ష్యాన్ని కనబర్చారు. 


‘ఎమ్మెల్యేలూ.. కనిపించవా గుంతలు’ అని ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి గుంతలు పూడ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోడ్లపై భారీ గుంతల పరిస్థితిని ప్రచురించగా, అధికారులు హుటాహుటిన పూడ్చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


వెంటనే పూడ్చాలి 

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రధాన, అంతర్గత రోడ్లపై భారీ వర్షాల వల్ల పడిన గుంతలను వెంటనే పూడ్చాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆదేశించారు. ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం ‘ఎమ్మెల్యేలూ.. కనిపించవా గుంతలు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో రోడ్లపై గుంతలు ఏర్పడితే వెంటనే పూడ్చి వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-07-16T16:26:26+05:30 IST