నాడు-నేడు పనులు 85శాతం పూర్తి

ABN , First Publish Date - 2020-11-29T05:51:39+05:30 IST

జిల్లాలో నాడు-నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో ఆధునికీకరణ నిర్మాణ పనులు 85శాతం పూర్తయ్యినట్టు జిల్లా కోఆర్డినేటర్‌ విజయభాస్కర్‌ అన్నారు.

నాడు-నేడు పనులు 85శాతం పూర్తి
నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న విజయభాస్కర్‌

  •  జిల్లా కోఆర్డినేటర్‌ విజయభాస్కర్‌రావు

గొల్లప్రోలు, నవంబరు 28: జిల్లాలో నాడు-నేడు పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో ఆధునికీకరణ నిర్మాణ పనులు 85శాతం పూర్తయ్యినట్టు జిల్లా కోఆర్డినేటర్‌ విజయభాస్కర్‌ అన్నారు. శనివారం గొల్లప్రోలు పట్టణం, మండలంలో నాడు-నేడు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ పనులకు 90శాతం నిధులు అందుబాటులో ఉన్నాయని, రూ.320 కోట్లు రావలసి ఉండగా రూ.214కోట్లు విడుదలయ్యాయన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 1372 స్కూళ్లలో మొదటి విడతగా పనులు జరుగుతున్నాయన్నారు. కొంత మెటీరియల్‌, మరికొంత నగదు రూపంలో అందజేసినట్టు చెప్పారు. రెండో ఫేజ్‌లో 4500 పాఠశాలలో పనులు ప్రారంభమవుతాయన్నారు. జిల్లాలో 92 భవనం లేని పాఠశాలలలున్నట్టు గుర్తించామన్నారు. ఈ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో దుర్గా ప్రసాద్‌, హెచ్‌ఎం.రమణమ్మ ఉన్నారు.

Updated Date - 2020-11-29T05:51:39+05:30 IST