సమస్యలు పరిష్కరించాలని స్కీం వర్కర్ల ధర్నా

ABN , First Publish Date - 2020-08-09T06:34:04+05:30 IST

ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ ..

సమస్యలు పరిష్కరించాలని స్కీం వర్కర్ల ధర్నా

ఆత్మకూర్‌/అమరచింత, ఆగస్టు 8: ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం ఆయా సంబంధిత కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు శ్రీహరి, ప్రసాద్‌, అమరచిం తలో జిల్లా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆర్‌ఎన్‌. రమేష్‌లు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందావని అన్నారు. స్కీమ్‌ వర్కర్ల కార్మికులుగా గుర్తించి కనీస వేతనం చట్ట ప్రకారం రూ. 21వేల నెలసరి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు ని ర్వహిస్తున్న ఆశావర్కర్లకు రూ.50లక్షల జీవిత బీమా కల్పించాలని కోరారు.  కరోనా నేపథ్యంలో అందరికి ప్రధాన మంత్రి జీవన్‌జ్యోతి, సురక్షా బీమా యోజన, కేంద్ర ప్రభుత్వం అమలు బీమాలను స్కీంవర్కర్లకు వర్తింపచే యాలని డిమాండ్‌ చేస్తూ అమరచింత చైర్‌ పర్సన్‌ మంగమ్మ వినతి పత్రం సమర్పించారు. ఆత్మకూర్‌లో మధ్యాహ్న బోజన ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కా ర్యకర్తలు నవనీత, రాణి, విజయలక్ష్మీ, గోవిందమ్మ, దేవమ్మ, సుజాత, బాలమ్మ, రాజమ్మ, భారతమ్మ,సత్తెమ్మ, నాగమమ్మ, అమరచింత మండల అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా నాయకురాలు నాగేంద్రమ్మ, ఆశవర్కర్‌ల జిల్లా నా యకురాలు శాంతమ్మ, బాలేశ్వరీ, వెంకటేశ్వరమ్మ, మేరీ, జయరాణి, రషీ దాబేగం, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.


కొత్తకోట:కార్మికుల సమస్యలను పరిస్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం తహసీల్‌ కార్యాలయం ముందు దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్‌ మాట్లాడుతూ ప్రభు త్వ పథకాలను కొనసాగిస్తూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు తస్లీమ్‌, భాగ్య, మంజుల, కళావతి,  సంతోష, స్వేత, ప్రసన్న, రేవతి, రజిత  పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-09T06:34:04+05:30 IST