భర్త ఉండగానే భార్యకు వితంతు పింఛను

ABN , First Publish Date - 2020-10-15T12:29:49+05:30 IST

యూపీలోని బాదాయూ జిల్లాలో బతికున్న భర్తను చనిపోయాడని చెబుతూ, కొంతమంది మహిళలు వితంతు పింఛన్లు పొందుతున్న ఉదంతం వెలుగు చూసింది. జిల్లాలో ఇలాంటి 106 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనిని గుర్తించిన అధికారులు...

భర్త ఉండగానే భార్యకు వితంతు పింఛను

బదాయూ: యూపీలోని బాదాయూ జిల్లాలో బతికున్న భర్తను చనిపోయాడని చెబుతూ, కొంతమంది మహిళలు వితంతు పింఛన్లు పొందుతున్న ఉదంతం వెలుగు చూసింది. జిల్లాలో ఇలాంటి 106 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనిని గుర్తించిన అధికారులు తదుపరి చర్యలు చేపట్టడంతోపాటు ఇప్పటివరకూ ఈ విధంగా పింఛన్లు పొందినవారి నుంచి ఆ మొత్తాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రొబెషన్ అధికారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 106 మంది మహిళలు తమ భర్తలు బతికి ఉన్నప్పటికీ, వారు చనిపోయారని సర్టిఫికెట్లు చూపిస్తూ, వితంతు పింఛన్లు అందుకుంటున్నారని తెలిపారు. 


వీరి మొదటి భర్తలు చనిపోయారని, వీరు రెండవ వివాహాలు చేసుకున్నప్పటికీ, వితంతు పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. రెండవ వివాహం అయిన తరువాత వీరెవరూ ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అనంతరం వీరి పింఛన్లు నిలిపివేశామన్నారు. ఇదిలావుండగా 891 మంది వితంతువులు మృతి చెందిన తరువాత కూడా వారి ఖాతాలకు డబ్బులు జమ అవుతుండటాన్ని కూడా గుర్తించామని తెలిపారు. ఈ ఉదంతాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2020-10-15T12:29:49+05:30 IST