మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2021-03-08T04:39:42+05:30 IST

సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ పి.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న కర్నూలు డీఐజీ వెంకట్రామిరెడ్డి

వైద్య శిబిరాలను మహిళా పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని  ప్రారంభించిన కర్నూలు రేంజ్‌ డీఐజీ  


కడప(క్రైం), మార్చి 7: సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలని కర్నూలు రేంజ్‌ డీఐజీ పి.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఉమే్‌షచంద్ర కళ్యాణ మండపంలో మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌తో కలిసి డీఐజీ ప్రారంభించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల ప్రాధాన్యతను పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. అలాగే మహిళా సంబంధిత కేసులకు సత్వర పరిష్కారం చేయడం సంతోషకరమని, దిశా యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎంపిక చేసిన షాపుల్లో రాయితీ ఇచ్చేందుకు కృషి చేయడం హర్షణీమన్నారు. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మహిళా సిబ్బంది తరచూ వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం మహిళా పోలీ సు సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఖాసింసాహెబ్‌, ఎం.దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ రిషికేశవరెడ్డి, పోలీసు యూనిట్‌ వైద్యులు డాక్టర్‌ సమీరా, ఏవోడీ వెంకటేశ్వర్‌రావు, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, కడప డీఎస్పీ బి.సునీల్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీలు బీవీ శివారెడ్డి, శ్రీధర్‌, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, ఎస్సీ ఎస్టీ సెట్‌ డీఎస్పీ రవికుమార్‌, ట్రాఫిక్‌ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, వైద్యనిపుణులు డాక్టర్‌ పి.రమ్యతారెడ్డి, శంకర్‌రెడ్డి, వంశీధర్‌, రామాంజులరెడ్డి, హేమలత, విజయభాస్కర్‌రెడ్డి, జావేద్‌బాషా, సీఐలు టీవీ సత్యనారాయణ,  శుభకుమార్‌, అశోక్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, నాగభూషణం, సత్యబాబు, ఆర్‌ఐలు శ్రీనివాసులు, మహబూబ్‌బాషా, జార్జి, సోమశేఖర్‌నాయక్‌, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T04:39:42+05:30 IST