మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-09-18T03:53:13+05:30 IST

మహిళలు చట్టాలు, హక్కులపై అవగాహన పెం చుకోవాలని మండల న్యాయ సేవా కమిటీ గౌరవాధ్యక్షురాలు, జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి హిమ బిందు పేర్కొన్నారు. శుక్రవారం బూదాక లాన్‌లోని ఎస్టీ కాలనీలో లీగల్‌ లిటరసీ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలకు సమస్యలు వచ్చి నప్పుడు దగ్గరలోని న్యాయ సేవా కమిటీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సదస్సులో మాట్లాడుతున్న బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి హిమబిందు

బెల్లంపల్లి, సెప్టెంబరు 17: మహిళలు చట్టాలు, హక్కులపై అవగాహన పెం చుకోవాలని మండల న్యాయ సేవా కమిటీ గౌరవాధ్యక్షురాలు, జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి హిమ బిందు పేర్కొన్నారు. శుక్రవారం బూదాక లాన్‌లోని ఎస్టీ కాలనీలో లీగల్‌ లిటరసీ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళలకు సమస్యలు వచ్చి నప్పుడు దగ్గరలోని న్యాయ సేవా కమిటీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రస్తు తం సెల్‌ఫోన్‌ల వినియోగం పెరిగిందని, దీంతో యువత తప్పుదారి పడుతు న్నారన్నారు. బాలికలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయని, బాలిక లను కనిపెట్టుకుని ఉండాలని సూచించారు. సర్పంచు లక్ష్మీఅశోక్‌, ఎంపీటీసీ అంకు, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మనోహన్‌, జనరల్‌ సెక్రెటరీ రాజేష్‌, న్యాయ వాదులు, తాళ్లగురిజాల ఎస్‌ఐ సమ్మయ్య పాల్గొన్నారు. 

లక్షెట్టిపేట: ప్రస్తుత సమాజంలో ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొ న్నారు.  విశ్రాంత ఉద్యోగులు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేతిరెడ్డిభూంరెడ్డి, కార్యదర్శి తిరుపతిస్వామి, న్యాయవాదులు, విశ్రాంత ఉద్యోగులు, పాల్గొన్నారు. 

 చెన్నూరు: ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెన్నూరు మున్సిఫ్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికుమార్‌ అన్నారు. శుక్రవారం జెండావాడలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతి థిగా మాట్లాడారు. ప్రజలకు న్యాయ సేవలు వివిధ చట్టాలపై వివరించారు.  

Updated Date - 2021-09-18T03:53:13+05:30 IST