హైదరాబాద్ సిటీ/హయత్‌నగర్ : నలుగురు పిల్లలను వదిలి గృహిణి అదృశ్యమెంది. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చత్తీస్‌ఘడ్‌కు చెందిన కార్తీక్ మోహర్, భార్య సంతోషి మోహర్, నలుగురు పిల్లలతో కలిసి నాలుగు నెలల క్రితం హయత్‌నగర్‌కు వలస వచ్చి బస్ డిపో వెనుక అద్దెకు ఉంటున్నాడు. భార్య, భర్తలు కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. ఈ నెల 15న భార్య సంతోషి మోహర్ టైలర్ వద్దకు వెళ్లి వస్తానని భర్తకు చెప్పి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం కనిపించలేదు. సొంత ఊరికి వెళ్లిందేమోనని అక్కడ కూడా విచారించారు. అక్కడికి కూడా వెళ్ల్లకపోవడంతో శనివారం ఆమె భర్త కార్తీక్‌మోహర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.