Viral: కాకికి ఆహారం అందించిన మహిళ.. ఆ కాకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-09T23:50:59+05:30 IST

మూగ జీవాలకు, పక్షులకు ఆహారం అందించి వాటి ఆకలి తీర్చడాన్ని కొద్ది మంది బాగా ఇష్టపడతారు.

Viral: కాకికి ఆహారం అందించిన మహిళ.. ఆ కాకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే..

మూగ జీవాలకు, పక్షులకు ఆహారం అందించి వాటి ఆకలి తీర్చడాన్ని కొద్ది మంది బాగా ఇష్టపడతారు. కరోనా సమయంలో ఎంతో మంది వీధి కుక్కలకు, ఇతర జంతువులకు ఆహారం అందించారు. అయితే ఆయా జీవాల నుంచి వెంటనే తిరిగి ప్రేమను పొందడం మాత్రం అరుదు అనే చెప్పాలి. అయితే ఓ ట్విటర్ యూజర్‌కు ఆ అరుదైన అనుభవం ఎదురైంది. కొలీన్ లిండ్సే అనే మహిళ ఇటీవల ఒక కాకికి పేస్ట్రీ ఆహారంగా ఇచ్చింది. ఆ మరుసటి రోజు ఆ కాకి నుంచి బహుమతిని (gift from a crow) అందుకుంది. 


తనకు ఎదురైన ఆ అనుభవం గురించి లిండ్సే ట్విటర్‌లో పోస్ట్ చేసింది. `లేక్ యూనియన్ వాటర్ ఫ్రంట్ దగ్గర ఉన్న ఒక కాకితో కొంచెం పేస్ట్రీని పంచుకున్నాను. తర్వాతి రోజు ఆ కాకి నాకు బహుమతి తెచ్చింది. ఒక చిన్న రాయిని తీసుకొచ్చి నా పాదాల దగ్గర వదిలింది` అని లిండ్సే తెలిపింది. ఆ కాకి, అది తీసుకొచ్చిన బహుమతికి సంబంధించిన ఫొటోలను కూడా లిండ్సే పోస్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం చేసిన ఈ పోస్ట్‌కు 58,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Updated Date - 2022-09-09T23:50:59+05:30 IST