మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-16T06:38:03+05:30 IST

బనగానపల్లె మండలం తమ్మడపల్లె-బనగానపల్లె రహదారిలో అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన పసుపుల లక్ష్మీచెన్నమ్మ(45) పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది.

మహిళ ఆత్మహత్య

బనగానపల్లె, ఆగస్టు 15: బనగానపల్లె మండలం తమ్మడపల్లె-బనగానపల్లె రహదారిలో అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన పసుపుల లక్ష్మీచెన్నమ్మ(45) పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన లక్ష్మీచెన్నమ్మ, అమె కుమారుడు మధు  పండ్ల వ్యాపారం చేసుకొని జీవించేవారు. లక్ష్మీచెన్నమ్మ భర్త చాలా ఏళ్ల కిందట మృతి చెందాడు. బేతంచెర్లలో పండ్ల వ్యాపారం చేసుకొని లక్ష్మీచెన్నమ్మ, కుమారుడు మధుతో కలిసి ఆటోలో కూతురు అత్తవారి ఇల్లు  తమ్మపల్లె గ్రామానికి చేరుకున్నారన్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఆటోలో బనగానపల్లెకు బయలుదేరారు. తమ్మడపల్లెలో ఏం జరిగిందోగాని మార్గమధ్యంలో కుమారుడు కుటుంబ సమస్యలు భరించలేకపోతున్నానని చావే శరణ్యమంటూ తాను తెచ్చుకున్న పెట్రోలు మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా... తల్లి అతడి చేతి నుంచి  పెట్రోల్‌ డబ్బా లాక్కొని తానే ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్‌ వంటిపై పోసుకొని నిప్పంటించుకున్నట్లు సీఐ సీఐ సుబ్బరాయుడు తెలిపారు. గాయపడిన లక్ష్మీచెన్నమ్మను బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసికెళ్లమన్నారు. అక్కడ కోలుకోలేక మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కుమారుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - 2022-08-16T06:38:03+05:30 IST