Advertisement
Advertisement
Abn logo
Advertisement

బయటకు వెళ్లిన భార్య ఎంతకూ తిరిగిరాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్తే.. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసిన ఆ భర్తకు.

ఇంటర్నెట్ డెస్క్: పశువులను మేపడానికి ఉదయం అనగా బయటకు వెళ్లిన భార్య ఎంతకీ తిరిగిరాకపోవడంతో భర్త కూడా ఆమెను వెతుక్కుంటూ వెళ్లాడు. భార్య ఎండకి తాళలేక ఎక్కడైన మూర్ఛపోయిందేమో అనుకుంటూ వెతుకుతుండగా.. అతడికి ఊహించని షాక్ తగిలింది. అతడికి నిర్జీవంగా పడి ఉన్న భార్య కనిపించింది. ఆ పక్కనే ఆమె మంగళసూత్రం..! ఇది చూసి అతడు నిర్ఘాంతపోయాడు. దారుణమేదో జరిగిందని భావించి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలోని ఓ చిన్నగ్రామంలో ఆగస్టు 24న ఈ ఘటన వెలుగు చూసింది. 

అయితే.. గ్రామస్థులు మాత్రం స్థానికంగా ఉండే కొందరు యువకులపైనే అనుమానం వ్యక్తం చేశారు. సమీపంలో ఉన్న గుట్టపై వారు తరచూ మద్యం సేవించేందుకు వెళుతుంటారని వారు పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో వారు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి  ఆపై హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా.. ఈ దారుణం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి పోస్ట్‌మార్టం రిపోర్టును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement