లూడో గేమ్ వేదికగా.. రాజస్తానీ మహిళ, పాకిస్తాన్ యువకుడి ప్రేమాయణం.. భర్త, రెండేళ్ల బాబును వదిలి వెళ్తుండగా..

ABN , First Publish Date - 2022-01-09T21:59:35+05:30 IST

భర్త, రెండేళ్ల బాబు ఉన్న మహిళ.. హాయిగా సంసారం చేసుకోకుండా సెల్‌లో లూడో గేమ్ ఆడింది. ఆడితే ఆడింది కానీ, అందులో పాకిస్తాన్ యువకుడితో పరిచయం పెంచుకుంది. కుటుంబం ఉందన్న విషయాన్ని మరచి.. అతడు రమ్మన్నాడని బయలుదేరింది...

లూడో గేమ్ వేదికగా.. రాజస్తానీ మహిళ, పాకిస్తాన్ యువకుడి ప్రేమాయణం.. భర్త, రెండేళ్ల బాబును వదిలి వెళ్తుండగా..
పోలీసుల అదుపులో మహిళ

ప్రేమకు కులం, మతం, ప్రాంతం, భాష, ఎల్లలు, సరిహద్దులు లేవని అంటూ ఉంటారు. ఇది నిజమే కానీ.. ఎంత ప్రేమైనా కొన్ని హద్దులు, పరిమితులు ఉండాలని పెద్దలు చెప్తుంటారు. ప్రేమ పేరు చెప్పి వయసు, వరస, కుటుంబ బాధ్యతలు మరచిపోతే.. చివరికి అందరిలో నవ్వులపాలు కావాల్సి ఉంటుంది. రాజస్తాన్‌లో ఓ మహిళ ప్రేమ పేరుతో ఇలాగే చేసింది. భర్త, రెండేళ్ల బాబు ఉన్న మహిళ.. హాయిగా సంసారం చేసుకోకుండా సెల్‌లో లూడో గేమ్ ఆడింది. ఆడితే ఆడింది కానీ, అందులో పాకిస్తాన్ యువకుడితో పరిచయం పెంచుకుంది. కుటుంబం ఉందన్న విషయాన్ని మరచి.. అతడు రమ్మన్నాడని బయలుదేరింది. తర్వాత ఏం జరిగిందంటే..


రాజస్థాన్‌‌లోని ధోల్‌పూర్‌కి శివానీ అనే మహిళకు భర్త, రెండేళ్ల బాబు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలు లేకపోవడంతో సంసారం సాఫీగా సాగిపోతోంది. అయితే శివానీకి సెల్‌లో గేమ్‌లు ఆడే పిచ్చి ఎక్కువ ఉంది. నిత్యం స్మార్ట్ ఫోన్‌లో ఆటల్లోనే గడిపేది. ఈ క్రమంలో ఆమెకు ఆరు నెలల క్రితం పాకిస్తాన్‌కి చెందిన ఆలీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రోజూ ఇద్దరు కలిసి ఆటలు ఆడే క్రమంలో పరిచయం పెరిగింది. కొన్నాళ్లకు ఈ పరిచయం కాస్త పర్సనల్ విషయాలు చర్చించుకునే వరకూ వచ్చింది. క్రమక్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. తనను పెళ్లి చేసుకుంటానని, బార్డర్‌లోకి వస్తే పాకిస్తాన్‌కి తీసుకెళ్తానని చెప్పాడు. దీంతో వెంటనే ఓకే చెప్పేసింది.

వదినను ఏకాంతంగా కలిసిన మరిది.. మద్యం మత్తులో అతడు చెప్పిన ఒక్క మాటతో.. తెల్లవారుజామున లేచి చూస్తే..


భర్త, రెండేళ్ల బాబు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా.. పాకిస్తాన్ యువకుడితో వెళ్లాలని నిర్ణయించుకుంది. బుధవారం మధ్యాహ్నం పాకిస్తాన్ బార్డర్‌కు బయలుదేరింది. ఆటోలో వెళ్తూ ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడింది. బార్డర్ దగ్గరికి వస్తున్నా అంటూ మాట్లాడటం విని.. ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. జలియన్ వాలాబాగ్ దగ్గర పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వివరాలు కనుక్కుని  ధోల్‌పూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఇలాంటి పనులు చేయొద్దని చెబుతూ రాజస్తాన్ పోలీసులు ప్రజలకు సూచించారు.

గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తల్లి.. ఈ ఏడేళ్ల కొడుకు చేసిన పనేంటో తెలిసి అవాక్కైన డాక్టర్లు..!

Updated Date - 2022-01-09T21:59:35+05:30 IST