భుబనేశ్వర్: ఆయేషా అనే మహిళ (27) రైలు కోచ్ లోపల ప్రసవించింది. శనివారం ఒడిశా రాజధాని భుబనేశ్వర్ రైల్వే స్టేషన్‌కు హౌరా-యశ్వంతాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు చేరుకున్న సమయంలో చోటు చేసుకుందీ సంఘటన. ఆ సమయంలో రైలులో ఉన్న సహ ప్రయాణికులు సహా సిబ్బంది సాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు సహకరించిన ప్రజలకు, తిరిగి వెళ్లేందుకు టికెట్ అందించిన వారికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపింది. తాను క్షేమంగా ఉన్నానని, ప్రస్తుతం తాను బెంగళూరుకు వెళ్లనున్నట్లు ఆయేషా తెలిపింది.
భుబనేశ్వర్ స్టేషన్ డైరెక్టర్ సీ నాయక్ స్పందిస్తూ ‘‘మేరి సహేలీ, రైల్వే ఆరోగ్య సిబ్బంది సహకారంతో ఆయేషా ఆరోగ్యంగా ప్రసవించింది. స్టేషన్‌లో ఆమెకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించాం. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. సీపీఆర్‌ఓ నిబంధనల మేరకు ఆమెకు తిరుగు ప్రయాణానికి టికెట్ అందించాం’’ అని అన్నారు.