కాబోయే భర్త కారులో కనిపించిందో కాగితం ముక్క.. దానిపై ఓ అమ్మాయి పేరు, ఫోన్ నెంబర్.. ఆమె కంగారుగా కాల్ చేస్తే..

ABN , First Publish Date - 2022-05-21T20:07:21+05:30 IST

బెంగళూరుకు చెందిన ఆ యువతి మాస్టర్స్ డిగ్రీ కోసం దుబాయ్ వెళ్లింది.. చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం కూడా సంపాదించింది..

కాబోయే భర్త కారులో కనిపించిందో కాగితం ముక్క.. దానిపై ఓ అమ్మాయి పేరు, ఫోన్ నెంబర్.. ఆమె కంగారుగా కాల్ చేస్తే..

బెంగళూరుకు చెందిన ఆ యువతి మాస్టర్స్ డిగ్రీ కోసం దుబాయ్ వెళ్లింది.. చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం కూడా సంపాదించింది.. ఆమెకు పెళ్లి కుదరడంతో భారత్‌కు వచ్చింది.. ఆమె లగేజ్‌ను రిసీవ్ చేసుకునేందుకు కాబోయే భర్త కూడా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాడు.. ఆమెను కారులో కూర్చోపెట్టి లగేజీ తీసుకురావడానికి వెళ్లాడు.. కారులో కూర్చున్న ఆ యువతికి ఓ చిన్న కాగితం ముక్క కనిపించింది.. దానిపై ఓ అమ్మాయి పేరు, మొబైల్ నెంబర్ రాసి ఉన్నాయి.. ఆమె కంగారు పడి ఫోన్ చేస్తే అసలు విషయం బయటపడింది.. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. 

ఇది కూడా చదవండి..

మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. పెళ్లిమంటపంలో నిరీక్షిస్తున్న వరుడు.. ఆమె ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..


బెంగళూరుకు చెందిన సల్మా దుబాయ్‌లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఆమెకు బెంగళూరుకు చెందిన ఆమిర్‌తో వివాహం కుదిరింది. వివాహం కోసం ఈ నెల 4వ తేదీన ఆమె బెంగళూరు చేరుకుంది. మూడ్రోజుల తర్వాత ఆమె లగేజ్ వచ్చింది. దీంతో లగేజ్ తీసుకోవడానికి కాబోయే భర్తతో పాటు ఆమె విమానాశ్రయానికి వెళ్లింది. ఆమెను కారులో కూర్చోబెట్టి ఆమిర్ లగేజ్ కోసం వెళ్లాడు. కారులో కూర్చున్న సల్మాకు లోపల ఒక కాగితం ముక్క కనిపించింది. దానిపై ఓ అమ్మాయి పేరు, మొబైల్ నెంబర్ రాసి ఉన్నాయి. సల్మా వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేసింది. ఓ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసి ఆమిర్ గురించి మాట్లాడింది. తామిద్దరం ఎన్నో రోజులు కలిసి తిరిగామని చెప్పింది. 


ఆమిర్ వచ్చిన వెంటనే ఆ అమ్మాయి గురించి సల్మా నిలదీసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమీర్.. సల్మాపై చేయి చేసుకున్నాడు. ఆమెను తీవ్రంగా తిట్టాడు. ఇంటికి వెళ్లిన సల్మా పది రోజుల పాటు బయటకు రాలేకపోయింది. తీవ్రంగా ఆలోచించి ఆమిర్‌తో వివాహాన్ని రద్దు చేసుకుంది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమిర్‌కు నోటీసులు పంపారు. 

Updated Date - 2022-05-21T20:07:21+05:30 IST