వారిద్దరికీ రెండ్రోజుల క్రితమే వివాహమైంది.. దేవుడిని దర్శించుకునేందుకు భార్య గుడికి వెళ్దామంటే కారులో బయలుదేరాడు.. గుడిలో భార్య కుటుంబ సభ్యులతో పాటు మరో యువకుడు కూడా ఉన్నాడు.. గుడిలోనే భర్తను కొట్టిన భార్య తన ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.. తనతో పాటు బంగారు నగలు, రూ.1.5 లక్షలు తీసుకెళ్లిపోయింది.. తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు.. కుటుంబ సభ్యులు కాపాడడంతో బతికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
భువనేశ్వర్‌కు చెందిన బలరామ్ అనే వ్యక్తి ఈ నెల 12వ తేదీన గోవిందా పూర్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత ఆ యువతి తన ప్రియుడితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ బలరామ్‌కు దొరికిపోయింది. బలరామ్ మందలించడంతో క్షమాపణ చెప్పింది. ఇక, ఎప్పుడూ అలాంటి పనులు చేయనని చెప్పి, ఒకసారి గుడికి తీసుకెళ్లమని అడిగింది. భార్య కోరిక మేరకు బలరామ్ కూడా కారులో గుడికి బయల్దేరాడు. గుడిలో తన భార్య కుటుంబ సభ్యులతో పాటు మరో యువకుడు కూడా కనిపించాడు. వారిని చూడగానే ఆ యువతికి ధైర్యం వచ్చింది.
తనతో పాటు వచ్చిన భర్తపై చేయి చేసుకుంది. అనంతరం భర్త ఎదురుగానే ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. బలరామ్‌కు చెందిన బంగారు నగలు, రూ.1.5 లక్షలు తనతో పాటు తీసుకెళ్లిపోయింది. భార్య చేసిన పనితో తీవ్ర మనస్థాపానికి గురైన బలరామ్ ఆత్మహత్యా యత్నం చేశాడు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించి కాపాడడంతో బతికిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి