Abn logo
May 17 2021 @ 00:02AM

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

శామీర్‌పేట : అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట గ్రామంలో లక్ష్మి(60) అనే మహిళ కనిపించడంలేదని కుటుంబసభ్యులు సైబరాబాద్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారమిచ్చారు. అనంతరం ఆమె ఫొటోను వాట్సాప్‌ గ్రూపులకు పంపినట్లు తెలిపారు. ఈ క్రమంలో మలక్‌పేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ కమ్యూనిటీ భవనంలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండడంతో స్థానికులు శామీర్‌పేట పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పూర్వాపరాలను పరిశీలించి శవపంచానామా చేశారు. కాగా ఆదివారం రాత్రి ఆమె అదృశ్యమైన మహిళగా పోలీసులు గుర్తించారు. వెంటనే క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement