Abn logo
May 17 2021 @ 00:04AM

మహిళ ఆత్మహత్య

షాబాద్‌: పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన షాబాద్‌ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లింగారెడ్డిగూడకు చెందిన జగదాంబ(65) ఆరోగ్యం బాగలేక ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోయి పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు పర్వతాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Advertisement
Advertisement