Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆపరేషన్ సమయంలో ఏడ్చినందుకు బిల్లేసిన డాక్టర్లు.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపట్ల ఆసుపత్రి దారుణంగా ప్రవర్తించింది. ఆ షాకింగ్ సంఘటనకు సంబంధించిన ఫొటోను తాజాగా ఆ మహిళ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె పోస్టు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆసుపత్రి వైఖరిని చూసి.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఎలా చేస్తారు.. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకీ ఆసుపత్రిలో ఏం జరిగింది. నెటిజన్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ పెట్టిన పోస్టులో ఏం ఉందనే విషయంలోకి వెళితే.. 


కొందరు చిన్న ఇంజక్షన్ తీసుకోవాలంటే హడలిపోతారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లా మారం చేస్తారు. అటువంటి పేషంట్లకు వైద్యులు.. ఎంతో ఓపికగా నచ్చజెప్పి పని పూర్తి చేయడాన్ని మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. కాగా.. ఇటువంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఒంటిపై ఉన్న పుట్టుమచ్చను శస్త్రచికిత్స ద్వారా తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఆమె ఓ ఆసుపత్రిని సందర్శించింది. దీంతో కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న పుట్టుమచ్చను శస్త్రచికిత్స ద్వారా తొలగించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. చిన్నపాటి ఇంజక్షన్ తీసుకోవడానికే భయపడే ఆ మహిళ.. ఆపరేషన్ సందర్భంగా తన భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోలేకపోయింది. 


చిన్నపిల్లలా కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఏడుస్తుండగానే ఆపరేషన్ పూర్తి చేసిన వైద్యులు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా.. డిశ్చార్జ్ నేపథ్యంలో ఆమెకు ఆసుపత్రి షాకిచ్చింది. ఆమె ఆపరేషన్‌కు సంబంధించిన బిల్లును చేతిలో పెట్టింది. ఆ బిల్లును చూసి.. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. బ్రీఫ్ ఎమోషన్‌కుగాను 11 డాలర్ల బిల్లు ఉండటాన్ని చూసి ఆమె కంగుతింది. ఏంటి విషయం అని ఆరా తీసీ.. చివరికి వాళ్లు చేప్పింది విని షాక్ అయింది. ఆపరేషన్ సందర్భంగా తాను ఏడ్చినందుకుగాను.. ఆసుపత్రి 11 డాలర్లను (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.817) అదనంగా చార్జ్ చేసినట్లు తెలిసుకుని విస్తుపోయింది. అనంతరం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆసుపత్రి బిల్లును కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement