ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది.. మంచి పనులు చేస్తున్నారంటూ మెచ్చుకుంది.. చివరకు..

ABN , First Publish Date - 2022-03-11T22:15:38+05:30 IST

అతను ఓ గ్రామ సర్పంచ్.. తను చేసిన పనుల గురించి రెగ్యులర్‌గా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టేవాడు..

ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది.. మంచి పనులు చేస్తున్నారంటూ మెచ్చుకుంది.. చివరకు..

అతను ఓ గ్రామ సర్పంచ్.. తను చేసిన పనుల గురించి రెగ్యులర్‌గా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టేవాడు.. ఆ క్రమంలో అతనికి ఓ యువతి నుంచి ఫేస్‌బుక్ రిక్వెస్ట్ వచ్చింది.. అతను యాక్సెప్ట్ చేయగానే ఆమె అతడితో స్నేహం ప్రారంభించింది.. అతడి ఫొటోలకు క్రమం తప్పకుండా కామెంట్లు పెట్టేది.. చివరకు ఫోన్ ద్వారా మాటలు కూడా కలిపింది.. అవసరం అని చెప్పి డబ్బులు అడిగి తీసుకుంది.. అవి తిరిగి అడిగితే షాక్ ఇచ్చింది. 


రాజస్థాన్‌లోని బికనీర్‌కు సమీపంలోని జస్రాసర్ గ్రామ సర్పంచ్ రామ్ నివాస్ తన సోషల్ వర్క్‌కు సంబంధించిన ఫొటోలను తరచుగా ఫేస్‌బుక్‌లో పెడుతుండేవాడు. ఆ క్రమంలో అతనికి రితూ చౌధురి అనే యువతి పరిచయమైంది. అతడితో మాటలు కలిపింది. అప్పుడప్పుడు అతడి నుంచి డబ్బులు అప్పుగా తీసుకుంది. అలా అతడి నుంచి ఆమె తీసుకున్న మొత్తం రూ.2.25 లక్షలకు చేరింది. ఆ డబ్బులను తిరిగి ఇమ్మని ఇటీవల ఆమెను రామ్ నివాస్ అడిగాడు. దాంతో ఆమె అడ్డం తిరిగింది. 


తనకు రూ.50 లక్షలు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని రామ్ నివాస్‌ను రితూ బెదిరించింది. షాకైన రామ్ నివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రితూ నుంచి వచ్చిన మెసేజ్‌లను పరిశీలించారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2022-03-11T22:15:38+05:30 IST