Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెల్ఫీ తీసుకుంటుండగా.. బలవంతంగా ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళపై దాడి చేయడంతో..

ఇంటర్నెట్ డెస్క్: ఆమె తన ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌ను కొంతమంది యువకులకు అద్దెకిచ్చింది. ఆ కుర్రాళ్లు గొడవ చేస్తున్నారంటూ పొరుగింటి వ్యక్తి ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలోనే ఆరోజు ఉదయం వరండాలో నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా.. సదరు పొరుగింటి వ్యక్తి తన సోదరుడితో కలిసి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె అతనితో ఏదో మాట్లాడేంతలోనే చాచిపెట్టి కొట్టాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. ఆమెను బలవంతంగా పైకి లేపి, ప్రహరీ గోడకు నొక్కిపెట్టి కొట్టడం ప్రారంభించాడు. అప్పుడే లోపలకు వచ్చిన చుట్టుపక్కల వాళ్లు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మొత్తం ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజి ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ గటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది.


పూంథురాలోని మానాకౌడ్‌కు చెందిన ఎన్.ఎస్. మన్సిలిల్ సుధీర్ అనే 37 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమీనా అనే 23 ఏళ్ల యువతి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన సుధీర్.. ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకులు అల్లరి చేస్తున్నారంటూ సుధీర్ ఆరోపించాడు. ఈ క్రమలోనే ఆమె చెప్పే మాటలు కూడా వినకుండా ఆమెపై దాడి చేశాడు. అతనితోపాటు నౌషద్ అనే వ్యక్తి కూడా అమీనాతో వాగ్వాదానికి దిగాడు. అమీనా ఇంట్లో అద్దెకుంటున్న యువకులు.. వారి కాంపౌండ్‌లోనే సెల్ఫీలు తీసుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఇలా కుర్రాళ్లను సెల్ఫీలు తీసుకోనివ్వకూడదని సుధీర్ అండ్ కో వాదించారు. ఇదే అంశాన్ని లేవనెత్తి అమీనాను తీవ్రంగా కొట్టారు. విషయం పోలీసులకు తెలియడంలో సుధీర్ ఇంటి నుంచి పరారైపోయాడు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నౌషద్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement