Viral Video: ఓ వ్యక్తితో స్కూటీపై వెళ్తున్న మహిళ.. బైక్‌పై వెనుక వస్తున్న మరో వ్యక్తి.. ఊహించని ఘటనతో ఆమె షాకింగ్ రెస్పాన్స్..!

ABN , First Publish Date - 2022-06-21T00:20:05+05:30 IST

అది బిజీ రోడ్డు. వాహనాల రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఆ దారిపై వెనకాల ఓ వ్యక్తిని కూర్చోబెట్టుకుని.. ఓ మహిళ స్కూటీపై వెళ్తూ ఉంటుంది. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయితే దానికి ఆమె ఇచ్చిన రెస్పాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

Viral Video: ఓ వ్యక్తితో స్కూటీపై వెళ్తున్న మహిళ.. బైక్‌పై వెనుక వస్తున్న మరో వ్యక్తి.. ఊహించని ఘటనతో ఆమె షాకింగ్ రెస్పాన్స్..!

ఇంటర్నెట్ డెస్క్: అది బిజీ రోడ్డు. వాహనాల రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. ఆ దారిపై వెనకాల ఓ వ్యక్తిని కూర్చోబెట్టుకుని.. ఓ మహిళ స్కూటీపై వెళ్తూ ఉంటుంది. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అయితే దానికి ఆమె ఇచ్చిన రెస్పాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఓ వ్యక్తిని స్కూటీ వెనకాల కూర్చోబెట్టుకుని.. బిజీ హైవేపై ఓ మహిళ స్కూటీ డ్రైవ్ చేస్తుండగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. స్కూటీ అదుపుతప్పి.. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరూ కింద పడిపోయారు. అయితే.. స్కూటీ నడిపే మహిళ మాత్రం.. వింతగా రియాక్ట్ అయింది. వెనకాల బైక్‌పై వస్తున్న వ్యక్తి వల్లే తాము పడ్డామని.. నోటికొచ్చినట్లు మాట్లాడింది. అంతేకాకుండా బైకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే.. సదరు బైకర్.. యూట్యూబ్ వ్లాగర్ కావడంతో.. అతడి వద్ద ఉన్న కెమెరాలో మహిళ బైక్ మీద నుంచి ఎలా పడిందనే దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇదే విషయాన్ని సదరు బైకర్ ఆ మహిళకు తెలియజేశాడు. స్కూటీ అదుపుతప్పడం వల్లే కింద పడ్డారని.. అందుకు సాక్ష్యంగా వీడియో కూడా చూపిస్తాను అనడంతో ఆ మహిళ నోరు మెదపకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. కాగా.. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ముందూ వెనకా ఆలోచించకుండా మహిళ మాట్లాడటంపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.  




Updated Date - 2022-06-21T00:20:05+05:30 IST