గాంధీ పేరు లేకుండా..

ABN , First Publish Date - 2020-02-25T09:42:25+05:30 IST

అద్భుతమైన ఈ పర్యటన ఏర్పాటు చేసిన నా గొప్ప మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు’’ - సబర్మతీ ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్‌ రాసిన సందేశమిది. ఆయన గాంధీ గురించి ఏమీ రాయకపోవడం గమనార్హం. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా

గాంధీ పేరు లేకుండా..

‘‘అద్భుతమైన ఈ పర్యటన ఏర్పాటు చేసిన నా గొప్ప మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు’’ - సబర్మతీ ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్‌ రాసిన సందేశమిది. ఆయన గాంధీ గురించి ఏమీ రాయకపోవడం గమనార్హం. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భారత్‌ వచ్చినప్పుడు ‘‘గాంధీ కేవలం భారతదేశానికే కాదు.. ప్రపంచం మొత్తానికీ హీరో. గాంధీజీ స్ఫూర్తి నేటికీ భారతదేశంలో సజీవంగా ఉంది. అది ప్రపంచానికే గొప్ప కానుక’’ అని రాసిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు.

Updated Date - 2020-02-25T09:42:25+05:30 IST