హెల్మెట్‌ లేకుంటే కేసే

ABN , First Publish Date - 2022-07-05T07:25:55+05:30 IST

రెండు రోజుల క్రితం దొడ్డిపల్లె ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ప్రమాదానికి గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన తెలిసిందే.

హెల్మెట్‌ లేకుంటే కేసే
సీజ్‌ చేసిన వాహనదారులతో సీఐ తదితరులు

చిత్తూరులో 300 మందిపై నమోదు 

చిత్తూరు, జూలై 4: రెండు రోజుల  క్రితం దొడ్డిపల్లె ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై ప్రమాదానికి గురై ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అంతకుముందు సీతమ్స్‌ కళాశాల వద్ద బైకుపై అతివేగంతో వెళతుఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ రెండు సంఘటనలకు ద్విచక్ర వాహనాలను నడిపిన వారు హెల్మెట్‌ ధరించకపోవడంతోనే ప్రమాదంతో మృతి చెందారని పోలీసులు గుర్తించారు. దాంతో జిల్లాలో హెల్మెట్‌ ధరించకుండా వాహనాలను నడిపేవారి కోసం సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. హెల్మెట్‌ లేకుండా వేగంగా వాహనాలను నడిపిన 300 మంది యువకులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఇకపై రోజు ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. హెల్మెట్‌ ధరించకుంటే వాహనాలను నడిపితే కేసుతో పాటు వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు.


Updated Date - 2022-07-05T07:25:55+05:30 IST