Abn logo
Jan 24 2021 @ 00:02AM

రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోండి


పాలకొండ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ బిల్లులు ఉప సంహరిం చుకోవాలని శనివారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు  డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం పాలకొండలో  ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఈనెల 26న జరిగే నిరసన కార్యక్రమానికి పాలకొండ ప్రాంతం నుంచి రైతులు తరలిరావాలని కోరారు.  కార్యక్రమంలో కె.రాము, దూసి దుర్గారావు, ఎం.రమేష్‌  పాల్గొన్నారు. 

రేపు రైతులకు మద్దతుగా సమావేశం

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా సోమవారం కవులు, రచయతలు, కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు   ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరుకానున్నారని పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement
Advertisement