ఒకే రక్త పరీక్షతో.. 50 రకాల కేన్సర్ల గుర్తింపు

ABN , First Publish Date - 2020-04-11T17:06:45+05:30 IST

ఓ సాధారణ రక్తపరీక్ష ఏకంగా 50 రకాల కేన్సర్లను గుర్తించగలదట. అది కూడా వ్యాధి లక్షణాలు బయటపడక ముందే!! కేన్సర్‌ ముప్పును ముందస్తుగా గుర్తించగల రక్తపరీక్షను

ఒకే రక్త పరీక్షతో.. 50 రకాల కేన్సర్ల గుర్తింపు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 10 : ఓ సాధారణ రక్తపరీక్ష ఏకంగా 50 రకాల కేన్సర్లను గుర్తించగలదట. అది కూడా వ్యాధి లక్షణాలు బయటపడక ముందే!! కేన్సర్‌ ముప్పును ముందస్తుగా గుర్తించగల రక్తపరీక్షను అమెరికాకు చెందిన ‘గ్రెయిల్‌’ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇప్పటికే కేన్సర్‌ ఉన్న 654 మంది, కేన్సర్‌ లేని 610 మందికి ఈ రక్తపరీక్షలు నిర్వహించగా 96 శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయి.


ఈ పరీక్ష కోసం సేకరించే రక్తంలో ఒకవేళ కేన్సర్‌ వ్రణాలు ఉంటే.. అవి వాటి డీఎన్‌ఏను రక్తంలోకి విడుదల చేస్తాయి. ఈ డీఎన్‌ఏ విశ్లేషణ ఆధారంగా కేన్సర్‌ ఉందా? లేదా? అనేది నిర్ధారిస్తారు. ఇది తేల్చేందుకు 3వేల మంది రక్తపరీక్షల ఫలితాల వివరాలతో ఓ ప్రత్యేకమైన కంప్యూటర్‌ అల్గారిథమ్‌ను కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.

Updated Date - 2020-04-11T17:06:45+05:30 IST