డెంగ్యూ కలకలంతో - అధికారుల పరుగులు

ABN , First Publish Date - 2022-06-29T05:03:06+05:30 IST

ఓ మహిళకు డెంగ్యూ జ్వరం అని తెలియడంతో గ్రామస్తు లు హడలిపోయారు.

డెంగ్యూ కలకలంతో - అధికారుల పరుగులు
గ్రామంలో పర్యటిస్తున్న వైద్యాధికారులు

ఖాజీపేట, జూన్‌ 28: ఓ మహిళకు డెంగ్యూ జ్వరం అని తెలియడంతో గ్రామస్తు లు హడలిపోయారు. ఈ విషయం అధికారులకు తెలపడంతో వారూ ఆరా తీసిన సంఘటన మంగళవారం ఖాజీపేట మండలంలో చోటు చేసుకుంది. ఆంజనేయపురం వాసి చెంగమ్మకు జ్వరం రావడంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు వెళ్లింది. అక్కడ పరీక్షించగా డెంగ్యూ లక్షణాలు ఉండడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు, మలేరియా అధికారి మనోరమ, మండల అభివృద్ధి అధికారి మైథిలి గ్రామానికి వె ళ్లి పరిశీలించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించి ప్రజలకు సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విస్తరణాధికారి వెంకటరెడ్డి, ఈఓపీఆర్‌డీ వెంకటసుబ్బారెడ్డి, మండల వైద్యాధికారి బాలకొండ్రాయుడు, సబ్‌ యూనిట్‌ అధికారి లక్షుమయ్య, సర్పంచ్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-29T05:03:06+05:30 IST