మహంకాళి బోనాల సందర్బంగా మద్యం షాపుల మూసివేత

ABN , First Publish Date - 2020-07-11T23:41:03+05:30 IST

బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో నార్త్, సెంట్రల్ జోన్‌లో మద్యం అమ్మకాలను బంద్ చేశారు.

మహంకాళి బోనాల సందర్బంగా మద్యం షాపుల మూసివేత

హైదరాబాద్ : బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో నార్త్, సెంట్రల్ జోన్‌లో మద్యం అమ్మకాలను బంద్ చేశారు. రేపు అనగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపుల మూసివేయాలని షాపుల యాజమాన్యాలకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.


నిబంధనలను అతిక్రమించి మద్యం షాపులు తెరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరపడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. కాగా.. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం అమ్మకాలను నిలిపివేయడం జరిగింది.

Updated Date - 2020-07-11T23:41:03+05:30 IST