Abn logo
Mar 2 2021 @ 23:02PM

మండలాభివృద్ధికి కృషి చేస్తా

- ఎమ్మెల్సీ గోరటి వెంకన్న 

పెద్దకొత్తపల్లి, మార్చి 2 : పెద్దకొత్తపల్లి మండలాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. మంగళవారం ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగపూర్‌ విష్ణు, జడ్పీటీసీ గౌరమ్మ, కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి వాటిని సద్వినియోగం చేసుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. మండల సభలో పలువురు ప్రజాప్రతినిధులు విద్య, వైద్యం, విద్యుత్‌, తాగునీటిపై సభలో చర్చించారు. సమావేశంలో ఎంపీడీవో కృష్ణయ్య, తహసీల్దార్‌ శ్రీనివాసాచారి, డా.మౌనిక, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement