అమరావతిలో లాక్‌డౌన్ తొలగించేదాకా అసెంబ్లీ జరగనివ్వం.. ఎమ్మెల్యే హెచ్చరిక!

ABN , First Publish Date - 2021-03-02T11:13:45+05:30 IST

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అమరావతిలో లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని బద్నేరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన ఎమ్మెల్యే రవి రాణా తప్పుబట్టారు.

అమరావతిలో లాక్‌డౌన్ తొలగించేదాకా అసెంబ్లీ జరగనివ్వం.. ఎమ్మెల్యే హెచ్చరిక!

అమరావతి: కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అమరావతిలో లాక్‌డౌన్ విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని బద్నేరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన ఎమ్మెల్యే రవి రాణా తప్పుబట్టారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మార్చి 8 వరకూ ఇక్కడ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ‘‘అమరావతిలో ఈ లాక్‌డౌన్ గనుక తొలగించకపోతే.. అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటాం’’ అని ఎమ్మెల్యే రవి రాణా హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

Updated Date - 2021-03-02T11:13:45+05:30 IST