స్టీల్‌ప్లాంట్‌ బాధిత రైతుల కోసం పోరాటం చేస్తా

ABN , First Publish Date - 2021-06-21T06:48:19+05:30 IST

ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌ బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని జమ్మలమడుగు టీడీపీ ఇనఛార్జి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. ఆదివారం ఉదయం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

స్టీల్‌ప్లాంట్‌ బాధిత రైతుల కోసం పోరాటం చేస్తా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

ఇసుక దోపిడీ జరుగుతోంది

జమ్మలమడుగు రూరల్‌, జూన 20: ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌ బాధిత రైతులకు న్యాయం జరిగే  వరకు పోరాటం చేస్తానని జమ్మలమడుగు టీడీపీ ఇనఛార్జి, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అన్నారు. ఆదివారం ఉదయం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండాపురం మండలంలో ఇసుక దోపిడీ జరుగుతోందని, టిప్పర్‌కు రూ.6 వేలు అధికంగా వసూలు చేస్తున్నారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ బాధితులు 259 మంది ఉన్నారని, రాజకీయంగా ఆ గ్రామ బాధిత రైతులను వైసీపీ మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారన్నారు. అప్పట్లో కొంతమందికి పాస్‌పుస్తకాలు ఇచ్చి మిగిలిన వారికి తర్వాత ఇస్తామని చెప్పారన్నారు. ఆ రైతులకు చంద్రబాబు హయాంలో పథకాలు అందాయని, ప్రస్తుతం జగనన్న ప్రవేశపెట్టిన రైతులకు పథకాలు, వారి వారి అకౌంట్లలో జమ అయిందన్నారు. దీనిని బట్టి చూస్తే ఆ భూములు ఆ రైతులకు చెందినవేనని అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం అధికారులు ఆనలైనలో వారి పేర్లు లేకుండా చేసినట్లు ఆరోపించారు. స్థానిక రెవెన్యూ అధికారులను రైతులు అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారన్నారు. సున్నపురాళ్లపల్లె 7వ అసైనమెంట్‌ బాధిత రైతులను సీఎం క్యాంపు కార్యాలయం తాడేపల్లెకు తీసుకెళ్లి సమస్యను వివరిస్తామన్నారు. రూ.35 కోట్ల పనులకు సంబంధించి స్టీల్‌ప్లాంట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి రద్దు చేయించారన్నారు. గతంలో రూ.30 కోట్లకు సంబంధించి పనులు 21 శాతం లెస్‌కు వేస్తే రద్దు చేశారని, తర్వాత నాలుగు శాతం లెస్‌కు వేస్తే దానిని కూడా రద్దు చేసి మూడోసారి రెండు శాతం ఎక్కువకు పనులు చేశారన్నారు. కొండాపురం ఇసుక దోపిడీలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేకు ముడుపులు అందుతున్నాయని తాను జమ్మలమడుగులోని ఏ దేవాలయం వద్దనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. అందుకు ఆయన కూడా సిద్ధమేనా అని ప్రశ్నించారు. జమ్మలమడుగులో రాత్రి సమయాల్లో ఎర్రమట్టి (గ్రావెల్‌) జోరుగా తరలిస్తున్నారని, పగలు ఎందుకు తరలించడం లేదని విమర్శించారు. మండలిలో టీడీపీ బలం తగ్గుతోందని కొందరు చేసిన విమర్శలపై స్పందిస్తూ నారా లోకేష్‌ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. సమావేశంలో టీడీపీ నాయకుడు సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:48:19+05:30 IST