డిప్యూటీ సీఎం బీఎస్పీకి ఇస్తాం: సుఖ్‌బిర్ సింగ్ బాదల్

ABN , First Publish Date - 2021-12-12T02:12:36+05:30 IST

ఇక అధికార పార్టీ కాంగ్రెస్‌పై సుఖ్‌బిర్ సింగ్ బాదల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లంచాలు తీసుకుని పదవులు అమ్ముకుంటున్న పంజాబ్ హోంమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రాందావా.. సరిహద్దుల్ని ఎలా కాపాడతారని, రాష్ట్రాన్ని..

డిప్యూటీ సీఎం బీఎస్పీకి ఇస్తాం: సుఖ్‌బిర్ సింగ్ బాదల్

చండీగఢ్: పంజాబ్‌తో ఎస్‌ఏడీ-బీఎస్‌పీ ప్రభుత్వం ఏర్పడితే ఉప ముఖ్యమంత్రి పదవి బహుజన్ సమాజ్ పార్టీకి కేటాయిస్తామని శిరోమణి అకాలీ దళ్ పార్టీ అధినేత సుఖ్‌బిర్ సింగ్ బాదల్ శనివారం ప్రకటించారు. పంజాబ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ దశాబ్దాల నుంచి ఎంతో కష్టపడి పార్టీని నిర్మిస్తూ వచ్చారని, ఆ కష్టాన్ని గుర్తించే తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన అన్నారు.


ఇక అధికార పార్టీ కాంగ్రెస్‌పై సుఖ్‌బిర్ సింగ్ బాదల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లంచాలు తీసుకుని పదవులు అమ్ముకుంటున్న పంజాబ్ హోంమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రాందావా.. సరిహద్దుల్ని ఎలా కాపాడతారని, రాష్ట్రాన్ని ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మన్సా వద్ద నిరుద్యోగులపై సీఎం భద్రతా బృందంలోని డీఎస్పీ చేసిన క్రూరత్వం అమానుషమని, దీనిపై కూడా చర్యలు తీసుకుంటామని సుఖ్‌బిర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-12T02:12:36+05:30 IST