WIIలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ABN , First Publish Date - 2022-08-13T21:14:50+05:30 IST

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(Wild life Institute of India)(డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WIIలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

ఖాళీలు 58


డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(Wild life Institute of India)(డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


1. ప్రాజెక్ట్‌ సైంటిస్టులు: 03

2. ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్స్‌: 01 

3. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియట్స్‌: 02

4. ప్రాజెక్ట్‌ అసోసియేట్స్‌: 48


అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.31,000 నుంచి రూ.67,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 22

వెబ్‌సైట్‌: https://wii.gov.in/

Updated Date - 2022-08-13T21:14:50+05:30 IST