ఏమాత్రం కష్టపడకుండానే కొందరికి కోట్ల కొద్దీ డబ్బు.. అసలు కారణమేంటో Mahabharatham లో చెప్పిన రహస్యమిదీ..!

ABN , First Publish Date - 2021-10-05T22:05:56+05:30 IST

కొందరు జీవితాంతం కష్టపడినా అంతంతమాత్రం సంపాదనతో కుటుంబాలను నెట్టుకొస్తుంటారు. మరికొందరు చూస్తుండగానే.. ధనవంతులు అయిపోతుంటారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడిన వారికి.. రోజుకు 24గంటలే.. ఉన్నట్టుండి ధనవంతులైన వారికీ 24గంటలే..

ఏమాత్రం కష్టపడకుండానే కొందరికి కోట్ల కొద్దీ డబ్బు.. అసలు కారణమేంటో Mahabharatham లో చెప్పిన రహస్యమిదీ..!

నేటి కలియుగంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మరేదానికీ లేదు. ఆఖరికి ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య కూడా డబ్బు.. చిచ్చుపెడుతుంది. అయితే కొందరు జీవితాంతం కష్టపడినా అంతంతమాత్రం సంపాదనతో కుటుంబాలను నెట్టుకొస్తుంటారు. మరికొందరు చూస్తుండగానే.. ధనవంతులు అయిపోతుంటారు. పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడిన వారికి.. రోజుకు 24గంటలే.. ఉన్నట్టుండి ధనవంతులైన వారికీ 24గంటలే.. మరి ఇదేలా సాధ్యం. అదే విధంగా ఆరోగ్యంగా ఉన్నవారు.. ఉన్నట్టుండి మరణిస్తుంటారు. అదే అనారోగ్యంతో ఉన్న వారు మళ్లీ కోలుకుని నూరేళ్లు జీవిస్తారు. మరోవైపు కొందరికి చదువు అసలు అబ్బదు.. ఇంకొందరికి అవలీలగా అబ్బుతుంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది..?


ఈ సందేహమే మహాభారతంలో ధర్మరాజుకు కూడా వచ్చింది. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్ముడి వద్దకు వెళ్లి ధర్మసూత్రాలను తెలుసుకోమని పాండవులకు శ్రీకృష్ణుడు చెబుతాడు. ‘‘పాండవులారా.. భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసన పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన వాడు. ధర్మ విషయంలో ఎటువంటి సందేహాలనైనా తీరుస్తాడు. ఆయన దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది.. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సందేహాలను తీర్చే వారు ఎవరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకునేందుకు బయలుదేరండి’’..  అంటా పాండవులను భీష్ముడి వద్దకు తీసుకెళ్తాడు. 

పాండవులదే విజయం అని నాకు తెలుసు.. అయినా దుర్యోధనుడితోనే ఉంటా.. భీష్ముడితో తేల్చిచెప్పిన కర్ణుడు..


ఆ సమయంలో భీష్ముడిని అడిగి ధర్మరాజు పలు సందేహాలను నివృత్తి చేసుకుంటాడు. ఈ క్రమంలోనే ఏమాత్రం కష్టపడకుండా ధనవంతులయ్యేవారి గురించి ఓ సందేహాన్ని అడుగుతాడు. ‘‘పితామహా! అప్రయత్నంగానే కొందరు ధనవంతులవుతున్నారు. ఇంకొందరు ఎంత ప్రయత్నించినా కాలేకపోతున్నారు. వారంతా ధర్మపరులు, నీతివేత్తలు అయినా ఫలితం లేకుండా పోతోంది? మరికొందరికి కావాల్సినంత ఐశ్వర్యం ఉంటుంది. అయితే అనుభవించే అవకాశమే ఉండదు. కొందరు ఏదీ అభ్యసించరు. అయినా వారికి అవలీలగా విద్యలు అలవడతాయి. కొందరికి ఎంత నూరిపోసినా ఏదీ అబ్బదు. అనారోగ్యంతో అలమటిస్తూ కూడా కొందరు నిండు నూరేళ్లూ జీవిస్తారు. ఇంకొందరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఇట్టే మరణిస్తున్నారు. దీనికి కారణాలేంటి?’’ అడిగాడు ధర్మరాజు. 


భీష్ముడు.. నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చాడు. ‘‘ధర్మనందనా! విత్తనం నాటకుండా మొక్క ఎలా వస్తుంది చెప్పు? పూర్వజన్మలో చేసిన పుణ్యాలే ఈ జన్మలో ఫలిస్తాయి. నాటి శుభకర్మల ఫలితాలే ఈ జన్మలో భూరి సంపత్తికి కారణమవుతున్నాయి. ఇక ఈ విషయమై నీకు అనుమానాలు అనవసరం. గతజన్మలో గొప్ప తపస్సు చేసిన కారణంగా ఈ జన్మలో భోగాలు అనుభవిస్తున్నారు. గత జన్మలో విధ్వాంసులు, వృద్ధులను సేవించడం వల్ల ఈ జన్మలో సూక్ష్మబుద్ధి, వైభవం, విద్యాసంపత్తి లభిస్తున్నాయి. గతజన్మలో అహింసను పాటించినవారు ఈ జన్మలో దీర్ఘాయుర్దాయాన్ని పొందుతున్నారు.’’ అని అన్నారు.

భీష్ముడి బాణాలకు మూర్ఛపోయిన అర్జునుడు.. ఆగ్రహంతో యుద్ధానికి సిద్ధమైన కృష్ణుడు..


కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా వింటున్న ధర్మరాజుని చూశాడు భీష్ముడు. మళ్ళీ ఇలా చెప్పాడు. ‘‘ముందుగా ధర్మాసక్తి అలవరుచుకోవాలి. అలవరుచుకుంటే క్రమంగా ధర్మతత్వం తేటతెల్లమవుతుంది. భావశుద్ధితో తపస్సు, వేదాధ్యయనం, స్నానసంధ్యలు, దానం, జపం, దేవతాపూజల్ని ఆయా వేళల్లో ఆచరించాలి. ఆచరిస్తే అపార ధర్మ సంపత్తి లభిస్తుంది. దీనివల్ల పరమపదాన్ని అందుకోవచ్చు. ధర్మనందనా! వ్యాసమహర్షి నీ కంటి వెలుగు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు నారాయణుడు. వీరిద్దరూ నీకు తోడుగా ఉన్నారు. లేనిపోని ఆలోచనలు పెట్టుకోక ప్రశాంత దృష్టితో ప్రజలను పాలించు. నీకంతా జయమే జరుగుతుంది.’’ అని చెప్పగా... ‘‘ధన్యుణ్ణి పితామహా’’ అన్నాడు ధర్మరాజు.

మహాభారతాన్ని సరళ వ్యవహారికంలో చదివేందుకు.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి.. 

Updated Date - 2021-10-05T22:05:56+05:30 IST