Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాగి జావ్ మంచిదంటారు.. ఎందుకని?

ఆంధ్రజ్యోతి(27-03-2021)

ప్రశ్న: రాగి పిండి, రాగి జావ మంచి ఆహారం అంటారు, ఎందుకని?


- సత్యనారాయణ మూర్తి, వరంగల్‌


డాక్టర్ సమాధానం: భారతదేశంలో క్రీస్తుపూర్వం 2300 ఏళ్ల నుంచీ వినియోగంలో ఉన్న చిరుధాన్యాలలో రాగులు ఒకటి. మనకు తెలిసిన ధాన్యాలు, చిరుధాన్యాలన్నిటి లోనూ రాగులలో కాల్షియం, పొటాషియం అధికంగా లభిస్తాయి. శాకాహారులకు ఐరన్‌ అందించే ఆహారపదార్థాలలో రాగులు ప్రధానమైనవి. బియ్యంతో పోల్చినప్పుడు రాగులలో పీచుపదార్ధం, ఖనిజలవణాలు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. మనకు శక్తినిచ్చే చాలారకాల ‘బి’ విటమిన్లు రాగులలో పుష్కలం. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల రాగులు మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెను రక్షించే లక్షణాలు కూడా ఉన్నాయి. రాగులలోని పీచుపదార్ధాల వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాక, పేగులలో పుండ్లు, అతిసార, పెద్దపేగుల కాన్సర్‌ నుంచి రక్షణ లభిస్తుంది. రాగులు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, అంటు వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి. రాగులను మొలకెత్తించడం వల్ల వాటిలోని పోషక గుణాలు వృద్ధి చెందుతాయి. మొలకలెత్తించిన రాగులతో చేసిన జావ పిల్లలకు కూడా తేలికగా జీర్ణమవుతుంది.


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...