ఎందుకులేబ్బా!

ABN , First Publish Date - 2022-05-30T06:47:35+05:30 IST

సబ్సిడీ విత్తన వేరు శనగపై రైతులు నిరాసక్తత చూపుతున్నారు. నాణ్యతపై సందేహాలతో కొందరు రైతులు వెనుకంజవేస్తున్నారు.

ఎందుకులేబ్బా!

సబ్సిడీ విత్తన వేరుశనగపై నిరాసక్తత..!

నాణ్యతపై రైతుల సందేహాలు  

 డబ్బులు కట్టినా ఎప్పుడిస్తారో తెలియని అయోమయం 

ఆర్బీకేల్లో ముందుకు సాగని నమోదు ప్రక్రియ

  తలలు పట్టుకుంటున్న  వ్యవసాయ యంత్రాంగం 


సబ్సిడీ విత్తన వేరు శనగపై రైతులు నిరాసక్తత చూపుతున్నారు. నాణ్యతపై సందేహాలతో కొందరు రైతులు వెనుకంజవేస్తున్నారు. ప్రభుత్వ ధరకు, బహిరంగ మార్కెట్‌లో ధరకు పెద్దగా తేడా లేదు. దీంతో కొందరు డబ్బులు కట్టినా విత్తన కాయలు ఎప్పుడు పంపిణీ చేస్తారో స్పష్టత లేకపోవడంతో  అయిష్టత చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు రిజిస్ర్టేషన చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


అనంతపురం అర్బన : సబ్సిడీ విత్తన వేరుశనగ నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలు రైతు భరోసా కేంద్రాల్లో  వేరుశనగ కాయలు డొల్లతనం బట్టబయలైంది. జిల్లాలోని గార్లదిన్నె, గుత్తి, సీకేపల్లి తదితర ప్రాంతాల్లో  రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేసిన 300 క్వింటాళ్ల దాకా నాసిరకం విత్తన కాయలను అధికారులు వెనక్కి పంపారు. మరికొన్ని మండలాల్లో నాసిరకం విత్తన కాయలు బయటపడినా స్థానిక అధికారులు తొక్కిపెట్టారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతేడాది రబీసీజనలో పం డించిన పంటలను ఏపీసీడ్స్‌ ద్వారా జిల్లాలోని రైతుల నుంచి సేకరించి, తిరిగి ఖరీ్‌ఫలో సబ్సిడీ రూపంలో పంపిణీ చేశారు. దీంతో నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందించ గలిగారు. ఈ ఏడాది విత్తన సరఫరాదారుల (ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకులు)కు విత్తనసేకరణ బాధ్యతలు అప్పగించారు. ఈ సారి విత్తన సేకరణ ప్రక్రియను ఆలస్యంగా ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభించా రు. ఈ పరిస్థితుల్లో కొందరు  విత్తన సరఫరాదారులు నాణ్యతలేని విత్తన కాయలు సేకరించి, ఆర్బీకేలకు పంపుతున్నట్లు సమాచారం. నాణ్యతలేని విత్తన బస్తాలను అప్పటికప్పుడే వెనక్కి పం పాల్సి ఉండగా పలు ప్రాంతాల్లో ఆ నిబంధనను తుంగలో తొక్కుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అందిం చే సబ్సిడీ విత్తన కాయలు నాణ్యంగా లేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని కరువు రైతులు ఆందోళన చెందుతున్నారు.  


ముందుకు సాగని పేర్ల రిజిసే్ట్రషన 

జిల్లా వ్యాప్తంగా ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు సేద్యం పనులు చేసుకోవడంలో రైతులు నిమగ్నమయ్యారు. ఆయా ప్రాంతాల్లో మరో మారు పదును వర్షం పడితే విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతు భరోసా కేంద్రా ల్లో వారం రోజుల నుంచి రైతుల పేర్లు నమోదు ప్రక్రియ మొదలు పెట్టారు. ఇప్పటి దాకా జిల్లా వ్యాప్తంగా 32వేల మందికి పైగా రైతులు 28వేల క్వింటాళ్లకు నమోదు చేసుకొని,  డబ్బులు చెల్లించారు. అయితే రిజిస్ట్రేషన ప్రక్రియ  ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంతో ఏం చేయాలో తెలియక వ్యవసాయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 


బహిరంగ మార్కెట్‌ ధరలో పెద్దగా తేడా లేకపోవడం 


ఈఏడాది జిల్లాకు 1.10 లక్షల క్వింటాళ్లు కేటాయించారు. ఇప్పటి దాకా జిల్లాలోని రైతు భరోసా కేంద్రాలకు 38వేల క్వింటాళ్లు సరఫరా చేశారు. విత్తన వేరుశనగ క్వింటా పూర్తి ధర రూ.8580లుగా నిర్ణయించారు. ఇందులో 40 శాతం సబ్సిడీ రూ.3432పోను రైతు వాటా క్వింటాకు రూ.5148లు చెల్లించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లో నాణ్యతను బట్టి క్వింటా విత్తన కాయలు రూ.6200 దాకా పలుకు తోంది. ప్రభుత్వం ధరకు, బహిరంగ మార్కెట్‌లో ధరకు పెద్దగా తేడా లేకపోవడంతోను కొందరు రైతులు ఆసక్తి చూపడం లేదన్న వాదనలున్నాయి. 



ధరలో పెద్దగా తేడా లేదు

ఆర్బీకేల్లో ప్రభుత్వం పంపిణీ చేసే ధరకు, బహిరంగ మార్కెట్‌లో విత్తన కాయల ధరకు పెద్దగా తేడా లేదు. ముందస్తుగా పేరు నమోదు చేసుకొని డబ్బులు కట్టినా నాణ్యమైన విత్తన కాయలు ఇస్తారో లేదోనన్న అనుమానాలున్నాయి. అందుకే ఇంకా పేరు రిజిస్ర్టేషన  చేసుకోలేదు. 

-  వీరాంజనేయులు, రైతు, చిన్నజలాలపురం, శింగనమల 


నాణ్యతపై అనుమానంతోనే

ప్రభుత్వం అందించే విత్తన కాయల నాణ్యతపై సందేహాలున్నాయి. అందుకే పేరు నమోదు చేసుకునేందుకు ఆలోచిస్తున్నాం. నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. ఈ సారి వేరుశనగ పంట సాగు చేయాలను కుంటున్నా. ఆర్బీకేలో పేర్లు నమోదైతే చేసుకుంటున్నారు. విత్తన కాయలు ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పడం లేదు. విత్తన కాయలు పంపిణీ మొదలు పెడితే ఒక వేళ నాణ్యంగా ఉంటే కొంటా. లేదంటే బయట మార్కెట్‌లో ముందస్తుగా అడిగి పెట్టుకున్నా. 

- రైతు  భాస్కర్‌రెడ్డి, 65 నిట్టూరు, యల్లనూరు మండలం  

Updated Date - 2022-05-30T06:47:35+05:30 IST