జీరో అవర్‌ లేని సమావేశాలు ఎందుకు..!

ABN , First Publish Date - 2021-10-29T05:13:06+05:30 IST

జీరో అవర్‌లేని సమావేశా లు ఎందుకని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు.

జీరో అవర్‌ లేని సమావేశాలు ఎందుకు..!
మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుతో మాట్లాడుతున్న ఆమంచి వర్గం కౌన్సిలర్లు

ఆమంచి వర్గం కౌన్సిలర్లు నిరసన

5 నిమిషాల్లో ముగిసిన సమావేశం

17 అంశాలను ఆమోదిస్తూ తీర్మానం

చీరాల, అక్టోబరు 28: జీరో అవర్‌లేని సమావేశా లు ఎందుకని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. గు రువారం చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన చీరాల మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమంచి వర్గం కౌన్సిలర్లు మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశాలకు వస్తున్నాం.. అజెండాలోని అంశాలపై చర్చించేం దుకు అవకాశం ఇవ్వడంలేదని నిరసన వ్యక్తం చేశారు. వార్డుల్లో సమస్యల అధికారులు, కౌన్సిల్‌ దృష్టికి తెద్దామంటే.. జీరో అవర్‌ ఎందుకు నిర్వహించడంలేదో అర్థం కా వడం లేదన్నారు.  జీరో అవర్‌ ఎందుకు నిర్వహిం చలేదో చెప్పాలని కౌన్సిల్‌లో ఆమంచి వర్గం కౌన్సిల ర్లు 10 మంది చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావును కోరారు. సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. పోడి యం ముందు ఆందోళన చేపట్టారు. 

కాగా, అజెండాలో మొత్తం 20 అంశాలు ఉం డగా, మొదటి మూడు అంశాలను వాయిదా వేస్తూ మిగిలిన 17 అంశాలను ఆమోదిస్తున్నట్లు వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు చెప్పారు. ఎమ్మెల్యే బలరాం వర్గం కౌన్సిలర్లు ఆమోదించటంతో కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే సమావేశం ముగిసింది. 

ఈ నేపథ్యంలో ఆమంచి వర్గంలో హాజరైన పది మంది కౌన్సిలర్లు కనీసం వార్డుల్లో సమస్యలు చెప్పేందుకు కూడా జీరో అవర్‌ ఎందుకు పెట్టరని పోడియం ముందుకువచ్చి చైర్మన్‌ శ్రీనివాస రావును ప్రశ్నించారు. మొదటి మూ డు అంశాలకు సంబంధించి గత రెండు సమావేశాల్లో కూడా అజెం డాలో పొందుపరచటం, వాయిదా వేయటంలో ఆంతర్యం ఏంటన్నారు. అయితే, వారికి పూర్తి స్థాయిలో స మాధానం ఇవ్వకుండా చైర్మన్‌, బల రాం వర్గం కౌన్సిలర్లు సమావేశ మందిరం నుంచి నిష్క్రమించారు. అనంతరం ఆ మోదం తెలిపిన అంశాలలో 19వ అంశానికి సం బంధించి పారిశుధ్య కార్మికులలో కొందరిని తొలగిం చాలని పేర్కొన్న అంశంపై ఆమంచి వర్గం కౌన్సిల ర్లు మున్సిపల్‌ కమిషనర్‌ మల్లీశ్వరరావుకు వ్రాతపూ ర్వకంగా డీసెంట్‌ ఇచ్చారు. గతంలో మూడు పర్యా యాలు  కూడా పలు అంశాలకు సంబంధించి డీ సెంట్‌ ఇచ్చామని వారు కమిషనర్‌కు తెలిపారు.

Updated Date - 2021-10-29T05:13:06+05:30 IST