ఆ టీచర్... ఇలా చేసిందేమిటి ?

ABN , First Publish Date - 2020-07-13T23:05:20+05:30 IST

కరోనా మహమ్మరి నేపధ్యంలో... పలు విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను బోధిస్తోన్న విషయం తెలిసిందే. అయితే... జార్ఖండ్ లోని తూర్పు సింఘ్భూమ్ జిల్లా జంషెడ్‌పూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలైన శైలా పర్వీన్ వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది.

ఆ టీచర్... ఇలా చేసిందేమిటి ?

జంషెడ్‌పూర్ : కరోనా మహమ్మరి నేపధ్యంలో... పలు విద్యాసంస్థలు ఆన్‌లైన్ తరగతులను బోధిస్తోన్న విషయం తెలిసిందే. అయితే... జార్ఖండ్ లోని తూర్పు సింఘ్భూమ్ జిల్లా జంషెడ్‌పూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలైన శైలా పర్వీన్ వ్యవహరించిన తీరు విమర్శలపాలైంది.


ఆన్‌లైన్‌లో ఎల్‌కేజీ,యూకేజీ చిన్నారులకు పాఠాలు చెప్పడం తో పాటు జాతీయ గీతాన్ని కూడా నేర్చుకోవాలని సూచించారు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే జాతీయ గీతం అంటే మనదేశ జాతీయ గీతం అనుకంటే పొరపాటే.


దేశ జాతీయ గీతంతో పాటు పొరుగు దేశాలైన పాకిస్తాన్,బాంగ్లాదేశ్ జాతీయ గీతాలను కూడా పిల్లలు నేర్చుకోవాలంటూ సూచించడం గమనార్హం. ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు ఆన్‌లైన్ లో క్లాసులు చెబుతూ పాక్, బంగ్లా జాతీయ గీతాలను నేర్చుకోవాలంటూ హోమ్‌వర్క్ ఇవ్వడమే కాకుండా వాటికి సంబందించిన యూట్యూబ్ లింకులను కూడా వారికి షేర్ చేసినట్లు తెలుస్తోంది.


ఈ ప్రహసనంపై విద్యార్థుల తల్లితండ్రులు మండిపడుతున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా... ఇలా పొరుగు దేశాల జాతీయ గీతాలు నేర్చుకోమంటూ హోంవర్క్ ఇవ్వడం పై వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


మరోపక్క ఈ ప్రహసనాన్ని ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి కునాల్ సారంగి తో పాటు పలువురులు రాజకీయ ప్రముఖులు తప్పుబడుతున్నారు.


తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.


అయితే టీచర్ మాత్రం... యజమాన్యం నిబంధనలకణుగుణంగానే పిల్లలకు పాఠాలు చెబుతున్నానని, విద్యార్థుల జ్ఞానాన్ని పెంచడం కోసమే ఇలా చేశానని చెబుతూ తన చర్యను సమర్ధించుకుంటున్నారు.మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2020-07-13T23:05:20+05:30 IST