స్ట్రెచ్చింగ్‌తో ఎందుకు రిలాక్స్‌గా అనిపిస్తుందో తెలుసా? ఇది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే..

ABN , First Publish Date - 2022-03-07T17:21:32+05:30 IST

వర్కవుట్‌కు ముందు బాడీ వార్మప్, స్ట్రెచ్చింగ్...

స్ట్రెచ్చింగ్‌తో ఎందుకు రిలాక్స్‌గా అనిపిస్తుందో తెలుసా? ఇది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే..

వర్కవుట్‌కు ముందు బాడీ వార్మప్, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు అవసరమని నిపుణులు చెబుతుంటారు. స్ట్రెచ్చిగ్‌తో వ్యాయామం ప్రారంభించడం ఎందుకు మంచిదని ఎప్పుడైనా ఆలోచించారా? సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం, వ్యాయామంలో సాగదీయడం(స్ట్రెచ్చింగ్) అనేది ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది. ఇది శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. స్ట్రెచ్ చేసినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లు విడుదలవుతాయని రిపోర్టు చెబుతోంది. ఈ చర్య కారణంగా కండరాలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. కండరాలలో స్ట్రెస్ తొలగిపోయి రిలాక్స్‌గా అనిపిస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది.


మొదటిది సింపథెటిక్, రెండవది పారాసింపథెటిక్. ఈ పారాసింపథెటిక్ పని.. శరీరానికి విశ్రాంతి కల్పించడం, శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేయడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం స్ట్రెచ్చింగ్ అనేది మెదడులోని పారాసింపథెటిక్ భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఈ భాగం శరీరానికి విశ్రాంతినిస్తుంది. అందువల్ల, స్ట్రెచ్చింగ్ తరువాత సదరు వ్యక్తి విశ్రాంతి అనుభూతికి లోనవుతాడు. శరీరం నుండి ఏదో బరువు  తగ్గినట్లు అనిపిస్తుంది. అందుకే మార్నింగ్ షెడ్యూల్‌లో ఖచ్చితంగా స్ట్రెచింగ్‌ చేయాలని నిపుణులు చెబుతుంటారు. ఇది శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. స్ట్రెచ్చింగ్ అనేది కండరాలలో ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపకరిస్తుందని నిపుణులు చెబుతారు.

Updated Date - 2022-03-07T17:21:32+05:30 IST