కాంచనజంగను అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? పోటీ పరీక్షల ప్రత్యేకం!

ABN , First Publish Date - 2022-05-21T21:54:59+05:30 IST

భారతదేశంలో మరణాల రేటు 6.2% పెరిగింది సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌(సీఆర్‌ఎస్‌) 2020 ఆధారంగా మినిస్ర్టీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌ ఆధ్వర్యంలోని రిజిస్ర్టార్‌ జనరల్‌ కార్యాలయం వార్షిక నివేదిక(2020)ను

కాంచనజంగను అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? పోటీ పరీక్షల ప్రత్యేకం!

జాతీయ అంశాలు


భారతదేశంలో మరణాల రేటు 6.2% పెరిగింది సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌(సీఆర్‌ఎస్‌) 2020 ఆధారంగా మినిస్ర్టీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌ ఆధ్వర్యంలోని రిజిస్ర్టార్‌ జనరల్‌ కార్యాలయం వార్షిక నివేదిక(2020)ను విడుదల చేసింది. దీని ప్రకారం 2019లో నమోదైన జననాల సంఖ్య 2.48 కోట్లు. 2020లో అది 2.42 కోట్లు. గత సంవత్సరంతో పోల్చితే 2.40ు తగ్గింది. అలాగే 2019లో నమోదైన మరణాల సంఖ్య 76.4 లక్షలు. 2020లో  81.2 లక్షలు. గత సంవత్సరంతో పోల్చితే 6.2ు పెరుగుదల నమోదైంది. 


మిషన్‌ సాగర్‌-9

ఈ మిషన్‌లో భాగంగా భారతదేశం తన నేవీ షిప్‌(ఐఎన్‌ఎస్‌) ఘరియల్‌ ద్వారా శ్రీలంకకు క్లిష్టమైన వైద్య సహాయాన్ని అందించింది. ఇందులో 107 రకాల క్రిటికల్‌ లైఫ్‌ సేవింగ్‌ మెడిసిన్స్‌ను ఏప్రిల్‌ 29న అందించింది. ఈ మిషన్‌ సాగర్‌-9ను మే 2020లో ప్రారంభించారు. ఇది హిందూ మహాసముద్ర తీర దేశాలకు కొవిడ్‌-19 సంబంధించిన సహాయాన్ని అందించడం దీని లక్ష్యం.


ఎం-15 పెట్రోల్‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీ) అసోంలోని టిస్సుకియా జిల్లాలో పైలెట్‌ ప్రాతిపదికన 15 శాతం మిథనాల్‌ మిశ్రమమున్న ‘ఎం-15 పెట్రోల్‌’ను విడుదల చేసింది. ఈ పెట్రోల్‌ భారతదేశంపై దిగుమతి భారాన్ని తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.


భారత్‌లో సోలార్‌ ఇన్‌స్టలేషన్‌ 2021కి 10 జీడబ్ల్యూ కెపాసిటీ

మెర్కాయ్‌ ఇండియా రిసెర్చ్‌ ఇటీవల విడుదల చేసి క్యూ4, వార్షిక ఇండియా సోలార్‌ మార్కెట్‌ అప్‌డేట్‌ రిపోర్టు ప్రకారం 2010లో 3.2 జీడబ్ల్యూ, 2021లో 10 జీడబ్ల్యూల సోలార్‌ ఇన్‌స్టలేషన్‌ను భారతదేశం సాధించింది. ఇది గత సంవత్సరంలో పోలిస్తే 210 శాతంగా నమోదైంది. ఇందులో రాజస్థాన్‌(4.5 జీడబ్ల్యూ), గుజరాత్‌(1.2 జీడబ్ల్యూ), ఉత్తరప్రదేశ్‌(885 ఎండబ్ల్యూ)తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.


భారత్‌లో మొదటి గ్రీన్‌ఫీల్డ్‌ ధాన్యం ఆధారిత ఇథనాల్‌ ఫ్యాక్టరీ

ఏప్రిల్‌ 30న బిహార్‌ ముఖ్యమంత్రి నితీ్‌షకుమార్‌ బిహార్‌లోని పూర్నియాలో దేశంలోనే మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్‌ ధాన్యం - ఆధారిత ఇథనాల్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ ప్లాంట్‌ రోజుకు 65వేల లీటర్ల ఇథనాల్‌ ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది. గోపాల్‌గంజ్‌, భోజ్‌పూర్‌ జిల్లాలో ఇలాంటి మరో రెండు యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 


అవార్డులు



విట్లీ గోల్డ్‌ అవార్డు 2022

ప్రముఖ జంతు సంరక్షకుడు, మంచు చిరుత నిపుణుడు చారుదత్‌ మిశ్రా ఆప్ఘనిస్థాన్‌, చైనా, రష్యా సహా 12 మంచు చిరుతల సంచారం ఉన్న దేశాల్లో చేసిన కృషికి గాను విట్లీ ఫండ్‌ ఫర్‌ నేచర్‌(డబ్ల్యూఎ్‌ఫఎన్‌) విట్లీ గోల్డ్‌ అవార్డు 2022 గెలుచుకున్నారు. ఇది ఈయనకు రెండోది. మొదటిసారి 2005లో లభించింది.


వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ 2022

మే 5న డెస్‌ మోయిన్స్‌కు చెందిన వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ వాతావరణ సంక్షోభం, ఆహార ఉత్పత్తిలో పరిశోధన చేసిన నాసాకు చెందిన సింథియా రోసెన్‌జ్‌వీగ్‌ అనే అమెరికా వ్యవసాయ, వాతావరణ శాస్త్రవేత్తకు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ 2022ను ప్రదానం చేశారు.


ఐఏసీసీ- 6వ ఆంత్రప్రెన్యూర్‌ అండ్‌ లీడర్‌షిప్‌ అవార్డులు 2022

ఇండో-అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐఏసీసీ) ఆరో ఆంత్రప్రెన్యూర్‌ అండ్‌ లీడర్‌షిప్‌ అవార్డులు 2022కు గాను ఉమన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అవార్డును మోదీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బీనామోదీకి కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రదానం చేశారు.


రోమైన్‌ రోలాండ్‌ బుక్‌ప్రైజ్‌ 2022

మే 7న న్యూఢిల్లీలోని బికనీర్‌ హౌస్‌లో జరిగిన ఫ్రెంచ్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఫ్రెంచ్‌ లిట్‌ఫెస్ట్‌ 2022లో ఫ్రెంచ్‌ నవల ’క్ఛఠటట్చఠజ్టూ, ఇౌుఽ్టట్ఛ్ఛుఽ్ఞఠ్ఛ్ట్ఛ’ బెంగాలీ అనువాదానికి రోయైున్‌ రోలాండ్‌ బుక్‌ప్రైజ్‌ 2022 లభించింది. దీనిని రచయిత, జర్నలిస్టు అయిన కమెల్‌ దౌద్‌ రాశారు.


వార్తల్లో వ్యక్తులు

అన్షుల్‌ స్వామి: ఏప్రిల్‌ 26న శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా అన్షుల్‌ స్వామి నియమితులయ్యారు. ఈయన సువీర్‌కుమార్‌ గుప్తా స్థానంలో వచ్చారు. దీని ప్రధాన కార్యాలయం నోయిడా, ఉత్తరప్రదేశ్‌లో ఉంది.

అరవింద్‌కృష్ణ: మే 4న ఐబీఎం చైర్మన్‌ అండ్‌ సీఈఓ అరవింద్‌కృష్ణ ఫెడరల్‌ రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో డైరెక్టర్ల బోర్డుకు ఎంపికయ్యా రు. ఈయన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే క్లాస్‌‘బి’ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం 2023 డిసెంబరు 31తో మగిసే మూడు సంవత్సరాల వ్యవధిలో కార్యాలయంలోని ఖాళీలను పూరించడానికి చేశారు.

తరుణ్‌కపూర్‌: మే 2న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తరుణ్‌కపూర్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సలహాదారునిగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం రెండు సంవత్సరాలు లేదా తదుపరి నియామకం జరిగే వరకు ఉంటుంది. భాస్కర్‌ ఖుల్బే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసిన తరవాత ఖాళీగా ఉన్న సలహాదారు పదవికి ఈయనను నియమించారు.

టోనీ బ్రూక్స్‌: 1950లలో ఆరు ఫార్ములా వన్‌ గ్రాండ్‌పిక్స్‌ గెలిచి ‘రేసింగ్‌ డెంటిస్ట్‌’ అనే పేరుతో పిలిచే టోనీ బ్రూక్స్‌ మే 3న తన 90 సంవత్సరాల వయసులో మరణించారు.

రోడ్రిగో చావ్స్‌: సోషల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెస్‌ పార్టీకి చెందిన ‘రోడ్రిగో చావ్స్‌’ మే 8న కోస్టారికా దేశ నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈయనజోస్‌ మారియా ఫిగ్యురేస్‌ స్థానంలో వచ్చారు.

రజత్‌కుమార్‌ కర్‌: పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ ఒడియా సాహితీవేత్త రజత్‌కుమార్‌ కర్‌ మే 8న ఒడిషాలోని భువనేశ్వర్‌లో మరణించారు. సాహిత్యం, విద్యారంగంలో కృషి చేసినందుకు 2021లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 

పండిత్‌ శివకుమార్‌ శర్మ: ప్రముఖ సంగీత విద్వాంసుడు, సంతూర్‌ వాద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన పండిత్‌ శివకుమార్‌ శర్మ మే 10న మహారాష్ట్రలోని ముంబైలో మరణించారు. ఈయనకు కళల రంగంలో చేసిన కృషికి 1991లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ అవార్డు లభించాయి. 1986లో సంగీత  అకాడమీ అవార్డు అందుకున్నారు.

సంగీతాసింగ్‌: మే 2 నుంచి సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ) చైర్మన్‌గా సంగీతాసింగ్‌ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈమె మూడు నెలల వరకు లేదా కొత్త చైర్మన్‌ను ఎన్నుకొనేవరకు కొనసాగుతారు. ఈమె ప్రస్తుతం ఆడిట్‌, న్యాయపరమైన వ్యవహారాలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. మాజీ చైర్మన్‌ జగన్నాథ్‌ బిద్యాధర్‌ మహాపాత్ర ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేసిన తరవాత అతని స్థానంలో ఈమెకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ప్రియాంక మోహితే: మే 5న ప్రపంచంలోనే మూడో ఎత్తయిన పర్వతమైన కాంచనజంగ(8,586)ను ప్రియాంక మోహితే 8000 మీ. పైన అయిదు శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. 2013లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని 2016లో మకాలు పర్వతాన్ని అధిరోహించారు.

గురుస్వామి కృష్ణమూర్తి: భారతదేశంలోని తమిళనాడుకు చెందిన గురుస్వామి కృష్ణమూర్తి ద మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ద బ్రిటిష్‌ అంపైర్‌(సివిల్‌ డివిజన్‌) అవార్డు 2022కు ఎంపిక య్యారు. కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో వెంటిలేటర్‌ చాలెంజ్‌కు గురుస్వామి చేసిన కృషికి గాను గుర్తింపు పొందారు.


-ఎస్‌. మహిపాల్‌రెడ్డి

సీనియర్‌ ఫ్యాకల్టీ



Updated Date - 2022-05-21T21:54:59+05:30 IST