కజకిస్థాన్‌లో కరోనాయేమో!

ABN , First Publish Date - 2020-07-12T08:07:19+05:30 IST

కజకిస్థాన్‌లో నమోదవుతున్న గుర్తుతెలియని న్యుమోనియా కేసులు కరోనా అయి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగం అధిపతి డాక్టర్‌ మైఖెల్‌ రేయాన్‌ అనుమానం వ్యక్తం చేశారు...

కజకిస్థాన్‌లో కరోనాయేమో!

  • ‘న్యుమోనియా’పై డబ్ల్యూహెచ్‌వో

లండన్‌, జూలై 11: కజకిస్థాన్‌లో నమోదవుతున్న గుర్తుతెలియని న్యుమోనియా కేసులు కరోనా అయి ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగం అధిపతి డాక్టర్‌ మైఖెల్‌ రేయాన్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడ నమోదవుతున్న అనేక న్యుమోనియా కేసుల్లో బయటపడుతున్న వైరస్‌ కరోనాను పోలి ఉంటోందని, పరీక్షల్లో సరైన నిర్ధారణ చేసి ఉండక పోవచ్చని అభిప్రాయపడ్డారు. డబ్ల్యూహెచ్‌వో బృందం ఇక్కడి లేబోరేటరీల్లో రోగులకు చెందిన ఎక్స్‌రేలు, ఇతర నమూనాలను పరిశీలిస్తోందని చెప్పారు. వారం రోజుల్లో కజకిస్థాన్‌లో 10కేసులను అధికారులు ధ్రువీకరించారు. ఈనెల 7 నాటికి కేసులు 50 వేలకు చేరువలో ఉండగా, 264 మంది మరణించారు.


Updated Date - 2020-07-12T08:07:19+05:30 IST