రిస్క్ పేషంట్లకు ఫైజర్ కొవిడ్-19 మాత్ర...WHO సిఫార్సు

ABN , First Publish Date - 2022-04-22T15:15:31+05:30 IST

రిస్క్ పేషంట్లకు ఫైజర్ కొవిడ్-19 యాంటీవైరల్ పిల్ పాక్స్ లోవిడ్‌ను సిఫార్సు చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం తెలిపింది....

రిస్క్ పేషంట్లకు ఫైజర్ కొవిడ్-19 మాత్ర...WHO సిఫార్సు

లండన్ : రిస్క్ పేషంట్లకు ఫైజర్ కొవిడ్-19 యాంటీవైరల్ పిల్ పాక్స్ లోవిడ్‌ను సిఫార్సు చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం తెలిపింది. వ్యాక్సిన్లు వేయించుకోని వారికి, వృద్ధులకు, రోగనిరోధక శక్తి లేని వారికి యూఎస్ ఫార్మా దిగ్గజ కంపెనీ విడుదల చేసిన నిర్మత్రెల్విర్, రిటోనావిర్ మందులు ఉత్తమమని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు తేల్చిచెప్పారు.3,100 మంది రోగులకు సంబంధించిన రెండు ట్రయల్స్ ఆధారంగా పాక్స్లోవిడ్ ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని 85శాతం తగ్గించిందని చూపించింది.ఐదు నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోలాజికల్ ఇ యొక్క కొవిడ్-19 వ్యాక్సిన్ కొర్బెవ్యాక్స్ ను అత్యవసర వినియోగానికి ఆమోదం తెలపాలని భారత సెంట్రల్ డ్రగ్ అథారిటీ యొక్క నిపుణుల బృందం సిఫార్సు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.


Updated Date - 2022-04-22T15:15:31+05:30 IST