ఆంధ్రజ్యోతి(20-05-2022)
ప్రశ్న: నా వయసు 31 ఏళ్లు. తల వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. సరైన ఆహారంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చా?
- కృష్ణ, నల్గొండ
డాక్టర్ సమాధానం: మధ్య వయసు దాటిన తరువాత వెంట్రుకలు నెరవడం సర్వసాధారణం. జన్యు, ఏవైనా ఆరోగ్య పరమైన కారణాలవల్ల, బి 12 విటమిన్, ఐరన్ లోపం, స్ట్రెస్ లేదా ఆందోళన, జుట్టుకు వాడే షాంపూలు పడకపోవడం, ధూమపానం లేదా దగ్గర్లో ఎవరైనా ధూమపానం చేయడం... ఇలా వివిధ కారణాల వల్ల ముందుగానే వెంట్రుకలు తెల్లబడే అవకాశం ఉంది. ఆహారంలో బీ 12 అధికంగా ఉండే పాలు, పెరుగు, మాంసం, గుడ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇనుము కోసం ఆకుకూరలు, అన్ని రకాల ఖనిజాల కోసం గింజలను తినాలి. మాంసకృత్తులని మాంసం లేదా గుడ్లు లేదా పప్పు ధాన్యాల రూపంలో ప్రతి పూటా తినడం కూడా కొంతవరకు ఈ సమస్యను అధిగమించేందుకు ఉపయోగపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, జీవన శైలితో కొంత వరకు ఈ సమస్య తీరినప్పటికీ వైద్యుల సలహాతో ఉత్తమ పరిష్కారం పొందడం మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
[email protected]కు పంపవచ్చు)