Abn logo
Jun 6 2020 @ 03:59AM

ఇళ్లలోనే ‘తెల్ల’ బంగారం

రాపూరు : ధర పతనంతో చేతికందిన కూడు నోటిదాకా చేరడం లేదని పత్తి రైతు  గగ్గోలు పెడుతున్నాడు. రాపూరు మండలం ఏపూరు గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగు చేశారు. అనుకున్న దానికంటే అధికంగానే దిగుబడులు రావడంతో తమ కష్టాలు తీరిపోయినట్లేనని ఆశించారు. అయితే, మొన్నటిదాకా కిలో రూ.60 పలికిన ధర ఇప్పుడు రూ.40కి పడిపోవడంతో హతాశుడయ్యాడు. ఈ మొత్తానికి విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావనే ఉద్దేశంతో 20 రోజులుగా ఇంట్లోనే ఉత్పత్తులను నిల్వ చేసుకున్నాడు. గ్రామంలో సుమారు 50 టన్నుల దాకా పత్తి నిల్వలు ఉన్నాయని, పాలకులు స్పందించి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతాంగం కోరుతోంది.

Advertisement
Advertisement
Advertisement