Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏ చేపలు మంచివి?

ఆంధ్రజ్యోతి(01-01-2021)

ప్రశ్న: సముద్రపు చేపలు, మంచి నీటి చేపల పోషకవిలువల్లో ఏవైనా తేడాలుంటాయా? ఏవి తినడం మంచిది?


- వజీర్‌ రెహమాన్‌, విజయవాడ


డాక్టర్ సమాధానం: సముద్రపు చేపలు, మంచినీటి చేపలు రెండూ మంచివే. పోషకవిలువల విషయంలో వీటిల్లో చిన్నపాటి తేడాలు ఉన్నాయి. మంచి నీటి చేపల్లో సాధారణంగా సముద్రపు చేపల కంటే కాల్షియం, మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఎక్కువ. మంచి నీటి చేపల్లో విటమిన్‌ - ఎ, ఫోలేట్‌ కొంచెం అధిక మొత్తంలో ఉంటాయి. ఆరోగ్యానికి హాని కలిగించే పాదరసం (మెర్క్యూరీ) నదులు, కాలువలు, చెరువులనుండి లభించే మంచి నీటి చేపల్లో ఎక్కువ ఉండేందుకు అవకాశముంది. ప్రొటీన్లు, ఆవశ్యక కొవ్వులు అధికంగా ఉండే చేపలలో మనకు ఏవి తాజాగా ఉంటే వాటిని ఎంచుకోవచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

[email protected] కు పంపవచ్చు)


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...