Hyderabad మెట్రో స్టేషన్లలో భద్రత డొల్ల.. పది రోజుల క్రితం ఏం జరిగింది..!?

ABN , First Publish Date - 2022-01-11T18:49:35+05:30 IST

Hyderabad మెట్రో స్టేషన్లలో భద్రత డొల్ల.. పది రోజుల క్రితం ఏం జరిగింది..!?

Hyderabad మెట్రో స్టేషన్లలో భద్రత డొల్ల.. పది రోజుల క్రితం ఏం జరిగింది..!?

  • పట్టాలపైకి  ప్రయాణికులు
  • ‘సికింద్రాబాద్‌ ఈస్ట్‌’ స్టేషన్‌ ఘటనతో ఆందోళన

హైదరాబాద్‌ సిటీ : మెట్రోస్టేషన్లలో భద్రత డొల్ల మరోసారి బట్టబయలైంది. ఓ వ్యక్తి మెట్రో పట్టాలపై నడుచుకుంటూ వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం సికింద్రాబాద్‌ ఈస్ట్‌ స్టేషన్‌కు వెళ్లిన ఓ ప్రయాణికుడు రైలు ఎక్కకుండా పట్టాలపై నడుచుకుంటూ వెళ్లాడు. ఎదురుగా రైలు వస్తున్నప్పటికీ అలాగే వెళ్తుండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మనించిన పైలెట్‌ రైలును నెమ్మదిగా నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. పైలెట్‌ దూరం నుంచి గమనించి రైలును నెమ్మదిగా ఆపడంతో ప్రమాదం తప్పిందని, వేగంగా ఉన్న సమయంలో నిలిపివేస్తే పట్టాలు తప్పి భారీ ప్రమాదం చోటుచేసుకునేదని ప్రయాణికులు చెబుతున్నారు. పట్టాలపై ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను తోటి ప్రయాణికులు అదే ప్లాట్‌ఫాం నుంచి తీయడంతో వైరల్‌ అయింది.

Updated Date - 2022-01-11T18:49:35+05:30 IST