పెళ్లికి ఒప్పుకోలేదని కుర్రాడి వింత నిర్వాకం.. గోడలపై పోస్టర్లు ప్రత్యక్ష్యం.. ఏం రాశాడో ఆ 21 ఏళ్ల యువతి చూసి..

ABN , First Publish Date - 2021-08-14T20:34:26+05:30 IST

ప్రేమిస్తున్నానంటూ ఓ యువతి వెంటబడ్డాడు.. పెళ్లి చేసుకుందామని వెంబడించాడు..

పెళ్లికి ఒప్పుకోలేదని కుర్రాడి వింత నిర్వాకం.. గోడలపై పోస్టర్లు ప్రత్యక్ష్యం.. ఏం రాశాడో ఆ 21 ఏళ్ల యువతి చూసి..

ప్రేమిస్తున్నానంటూ ఓ యువతి వెంటబడ్డాడు.. పెళ్లి చేసుకుందామని వెంబడించాడు.. అందుకు ఆ యువతి నిరాకరించింది.. దీంతో ఆమెను బెదిరిస్తూ మెసేజ్‌లు పంపాడు.. అయినా ఆమె లొంగలేదు.. దీంతో ఆమె పరువు తీయాలనుకున్నాడు.. ఆమెను తన భార్యగా పేర్కొంటూ ఊరు ఊరంతా పోస్టర్లు అంటించాడు.. ఆమె నిలదీయడంతో డబ్బులు డిమాండ్ చేశాడు.. దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ ఘటన జరిగింది. 


బహోదాపూర్‌కు చెందిన అజయ్ కరణ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం 23 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన ఆమెతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరించింది. పెళ్లి కుదరదని చెప్పేసింది. దీంతో అజయ్ ఆమెపై పగ పెంచుకున్నాడు. ఆమె పరువు తీయాలనుకున్నాడు.ఆమెను తన భార్యగా పేర్కొంటూ ఆమె ఫొటో వేసి ఊరంతా పోస్టర్లు అంటించాడు. వాటిని తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పోస్ట్ చేశాడు. 


ఆ పోస్టర్లను చూసిన యువతి అజయ్‌కు ఫోన్ చేసి నిలదీసింది. ఆ పోస్టర్లను వెంటనే తొలగించాలని కోరింది. అలా చేయాలంటే తను కోరినంత డబ్బులు ఇవ్వాలని యువతిని అజయ్ బెదిరించాడు. దీంతో యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజయ్ గురించి గాలిస్తున్నారు. 


Updated Date - 2021-08-14T20:34:26+05:30 IST