స్కూల్‌లో దారుణ ఘటన.. ఈ అమ్మాయిల కులం ఏంటో తెలుసా..? వాళ్లు వడ్డించింది తింటున్నారేంటంటూ..

ABN , First Publish Date - 2022-09-03T20:52:25+05:30 IST

దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, అక్షరాస్యత శాతం పెరుగుతున్నా ఇంకా పలు చోట్ల కుల వివక్ష (caste discrimination)రాజ్యమేలుతూనే ఉంది.

స్కూల్‌లో దారుణ ఘటన.. ఈ అమ్మాయిల కులం ఏంటో తెలుసా..? వాళ్లు వడ్డించింది తింటున్నారేంటంటూ..

దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, అక్షరాస్యత శాతం పెరుగుతున్నా ఇంకా పలు చోట్ల కుల వివక్ష (caste discrimination)రాజ్యమేలుతూనే ఉంది. దళితులను, గిరజనులను చులకనగా చూసే నీచ సంస్కృతి బుసలు కొడుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్‌ (Rajasthan)లోని ఉదయ్‌పూర్‌లో ఓ పాఠశాలలో మిడ్ డే మీల్ సందర్భంగా ఓ కుక్ దళిత బాలికలను అవమానించాడు. భోజనం వడ్డిస్తున్న ఆ బాలికలను కులం పేరుతో దూషించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. 


ఇది కూడా చదవండి..

నాకీ పెళ్లి వద్దంటూ సరిగ్గా ఒక్క రోజు ముందు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన వధువు.. ఆ వరుడి గురించి దారుణ నిజాలు విని..


ఉదయ్‌పూర్‌కు సమీపంలోని భరోడి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజన సమయంలో డింపుల్ మేఘ్వాల్ (13), నీమా మేఘ్వాల్ (14) అనే విద్యార్థులు అందరికీ పప్పు, రోటీ వడ్డిస్తున్నారు. వారిని చూసిన వంట మనిషి లాలూరామ్ గుర్జార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. భోజనం వడ్డిస్తున్న విద్యార్థులు తక్కువ కులస్తులని, వారు వడ్డిస్తుంటే తినకూడదని కేకలు వేశాడు. అంతేకాదు చాలా మంది పిల్లలు తింటున్న ఆహారాన్ని విసిరేశాడు. దీంతో ఆ బాలికలిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు లాలూరామ్ గుర్జార్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2022-09-03T20:52:25+05:30 IST