Advertisement
Advertisement
Abn logo
Advertisement

డ్యూటీకి వెళ్లిన బావ.. స్కూలుకెళ్లిన మేనకోడలు.. అక్కయ్యను చూసి పోదామని వెళ్లిన సోదరుడికి ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి..

ఆమె ఒక బ్యుటీషియన్.. గురువారం ఉదయం ఎప్పటిలాగానే ఆమె భర్త డ్యూటీకి, కూతురు స్కూలుకి వెళ్లిపోయారు.. తర్వాత ఆమెను చూసేందుకు ఆమె సోదరుడు ఇంటికి వచ్చాడు.. అప్పటికి ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంది.. ఇల్లంతా పొగతో నిండి ఉంది.. బాత్రూమ్‌లో ఏవో కాగితాలు మంటల్లో పడి ఉన్నాయి.. దీంతో అతను వెంటనే బావకు, పోలీసులకు విషయం చెప్పాడు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది.


కాన్పూర్‌కు చెందిన ఆనంద్ కుమార్ మౌర్య ఓ షూ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని భార్య లక్ష్మి (45) ఇంటి దగ్గరే బ్యూటీపార్లర్‌ను నడుపుతోంది. గురువారం ఉదయం ఆనంద్ డ్యూటీకి, కూతురు ఆకాంక్ష పాఠశాలకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మి సోదరుడు రామశంకర్ ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పటికి లక్ష్మి ప్రాణాలు కోల్పోయి ఉంది. ఇల్లంతా పొగతో నిండి ఉంది. కొన్ని దస్తావేజులు బాత్రూమ్‌లో మంటల్లో పడి ఉన్నాయి. దీంతో రామశంకర్ వెంటనే పోలీసులకు, బావ ఆనంద్ కుమార్‌కు విషయం చెప్పాడు. 


ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఎవరో దగ్గర బంధువులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహంపై బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. చుట్టుపక్కల వారిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు దోపిడీ జరిగి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. డబ్బులు, నగలను దోచుకుని ఆమెను చంపేసి ఉంటారని కొందరు అంటున్నారు. పాఠశాల నుంచి వచ్చిన బాలిక తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement