వ్యవసాయానికి ఉపాధి అనుసంధానమెప్పుడో?

ABN , First Publish Date - 2021-01-22T04:50:30+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవ సాయ రంగానికి పూర్తిస్థాయిలో అనుసంధానం చే యాలనే రైతుల అభ్యర్థన అరణ్యరోదనగానే మిగులు తోంది. ప్రస్తుతం కొన్ని పనులకే పరిమితమైన ఉపా ధి హామిని వ్యవసాయరంగానికి పూర్తిస్థాయిలో అను సంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

వ్యవసాయానికి ఉపాధి అనుసంధానమెప్పుడో?

రైతులకు తప్పని ఎదురుచూపులు

నీతి అయోగ్‌ సూచించినా.. పట్టని కేంద్ర ప్రభుత్వం

వ్యవసాయ పనులకు కూలీల కొరత

ఇబ్బంది పడుతున్న అన్నదాతలు

అనుసంధానిస్తే రైతులపై తగ్గనున్న భారం

కామారెడ్డి, జనవరి 21: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవ సాయ రంగానికి పూర్తిస్థాయిలో అనుసంధానం చే యాలనే రైతుల అభ్యర్థన అరణ్యరోదనగానే మిగులు తోంది. ప్రస్తుతం కొన్ని పనులకే పరిమితమైన ఉపా ధి హామిని వ్యవసాయరంగానికి పూర్తిస్థాయిలో అను సంధానం చేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. కేంద్రప్రభుత్వం ఈ విషయమై సీఎంల కమిటీని సైతం నియమించింది. ఆ కమిటీ ముసాయిదా సైతం సిద్ధం అ యింది. ఉపాధి హామీ వ్యవసాయరంగానికి అనుసంధా నం చేస్తే రైతులకు పెట్టుబడి భారం తగ్గడంతో పాటు కూలీలకు ఏడాది పొడవునా పనులు లభిస్తాయని రైతు సంఘాల నేతలు అంటున్నారు.

సాగు పనులు ఇలా..

ప్రస్తుతం ఈజీఎస్‌ కింద వ్యవసాయరంగానికి ఊతమి చ్చేలా పందిరి కూరగాయాలసాగు, షెడ్ల నిర్మాణం, బావుల తవ్వకం, పూడికతీత, నీటి నిల్వ కందకాలు తవ్వకం, వర్మికం పోస్టు గుంతల తవ్వకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో పారి శుధ్య నిర్వహణకు డంపింగ్‌ యార్డుల నిర్మాణాలు చేపడుతు న్నారు. ఈ మేరకు జిల్లాలో ఏటా కోట్ల ఈజీఎస్‌ పనులకు వె చ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరినాట్లు, పత్తితీత, కలుపుతీత, తదితరపనులకు ఉపాధి హామీ ద్వారా సాయమందించేలా ప్ర జాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

భారంగా కూలీల ఖర్చు

ఇటీవల వ్యవసాయ పనులకు వెళ్లే కూలీల సంఖ్య తగ్గడంతో సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో వ్యవసా య పనులు జోరుగా సాగే రోజుల్లో ఉపాధి హామీ పనులు నిలిపి వేయాల్సి వస్తోంది. కూలీలు దొరకక సమీప గ్రామాల నుంచి ఆ టోలు, ట్రాక్టర్లలో తీసుకురావాల్సిన పరిస్థితి. దీంతో ఒక్కో కూలీకి రోజుకు సగటున రూ.300 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి వ స్తోంది. ఇలా ఒక ఎకరం పత్తి చేనులో కలుపు తీయడానికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. సాగుకాలంలో ఎకరం పొలంలో కలుపుతీయడానికి రైతుకు రూ.10 వేలకు పైగా ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ఉపాధి హామీని కేటాయిస్తున్న కొంత ఉపశమనం కలుగుతుందని రైతులు పేర్కొం టున్నారు.

నీతి అయోగ్‌ ఏమి సూచించిందంటే..

వ్యవసాయానికి ఉపాధిహామీ పనులను పూర్తిస్థాయిలో అనుస ంధానించాలని 2016 ఏప్రిల్‌లోనే కేంద్ర ప్రభుత్వానికి నీతి అయోగ్‌ సూచించింది. ఈజీఎస్‌ ద్వారా చేపట్టే పొలం పనుల్లో 75 శాతం రై తులు భరించేలా 25 శాతం ప్రభుత్వం చెల్లించేలా వ్యవసాయ ప నులను చేపట్టాలని తెలిపింది. ఇప్పటివరకు సాగు పనులకు ఉపా ధి హామీ సాయం అందనే లేదు. రైతులు స్వతహాగా చేపట్టే తమ పొలాల్లోని పనులను ఈజీఎస్‌కు అనుసంధించాలని నీతి అయోగ్‌ సూచించినా అమలు చేయడం లేదు.

Updated Date - 2021-01-22T04:50:30+05:30 IST