Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాట్సాప్‌తో ‘ఉబర్‌’ బుకింగ్‌

ఉబర్‌ క్యాబ్‌ బుకింగ్‌ కోసం ఇప్పుడు యాప్‌తో పనిలేదు. వాట్సాప్‌ వినియోగదారులు సదరు ఉబర్‌ వాట్సాప్‌ చాట్‌బోట్‌ సహాయంతోనూ   క్యాబ్‌లను బుక్‌ చేసుకోవచ్చు. ఈవారం నుంచే లక్నోలో ఈ సదుపాయం ప్రారంభమైంది. తదుపరి న్యూఢిల్లీ, వచ్చే ఏడాదిలో ఇండియా మొత్తానికి ఈ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే, వాట్సాప్‌ ఉన్న స్మార్ట్‌ ఫోన్లలో ఉబర్‌ యాప్‌ను ప్రత్యేకించి ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. యాప్‌లో మాదిరిగానే డ్రైవర్‌ వివరాలు ఉంటాయి. సేఫ్టీ నుంచి ఇన్సూరెన్స్‌ ప్రొటెక్షన్‌ వరకు అన్నీ ఉంటాయి.  మొదట్లో ఇంగ్లీష్‌లో ఉన్నప్పటికీ రానురాను భారతీయ భాషలు అన్నింటికీ మేసేజింగ్‌ మొదలైన సేవలు విస్తరిస్తారు. మూడు చిన్నపాటి చర్యలతో వెహికల్‌ని బుక్‌ చేసుకోవచ్చు. ఉబర్‌ బిజినెస్‌ అకౌంట్‌ నంబర్‌కు మొదట మెసేజ్‌ చేయాలి. తరవాత క్యూఆర్‌ కోడ్‌ను స్కానింగ్‌ చేయాలి లేదంటే ఉబర్‌ యాప్‌ చాట్‌ లింక్‌ను ఓపెన్‌ చేయాలి. పికప్‌, డ్రాప్‌ లొకేషన్స్‌ అడుగుతారు. ఆపై చార్జీ, డ్రైవర్‌ ఎంతసేపట్లో వెహికల్‌తో ఉంటారు, సమయం సహా వివరాలు వినియోగ దారుడికి వస్తాయి. అలా వాట్సాప్‌తోనే ఉబర్‌ ప్రయాణం చేసేయవచ్చు.

Advertisement
Advertisement