వాట్సాప్‌ చాట్‌కు సరికొత్త అందాలు

ABN , First Publish Date - 2020-12-05T05:47:59+05:30 IST

వివిధ గ్రూపుల్లో జరిపే సంభాషణలకు అనుగుణంగా వెనుక అందంగా వాల్‌పేపర్‌ను జత చేసుకునే సౌలభ్యాన్ని వాట్సాప్‌ కలుగజేస్తోంది. కొద్దిగా కొత్తగా అనిపిస్తున్నప్పటికీ మీరు కోరుకున్న విధంగా ఛాట్‌కు వెనుక రంగుతో నేపథ్యం పులమవచ్చు. దీంతో ఛాట్‌ ఆకట్టుకునే రంగుల మధ్య ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది

వాట్సాప్‌ చాట్‌కు సరికొత్త అందాలు

వివిధ గ్రూపుల్లో జరిపే సంభాషణలకు అనుగుణంగా వెనుక అందంగా వాల్‌పేపర్‌ను జత చేసుకునే సౌలభ్యాన్ని వాట్సాప్‌ కలుగజేస్తోంది. కొద్దిగా కొత్తగా అనిపిస్తున్నప్పటికీ మీరు కోరుకున్న విధంగా ఛాట్‌కు వెనుక రంగుతో నేపథ్యం పులమవచ్చు. దీంతో ఛాట్‌ ఆకట్టుకునే రంగుల మధ్య ఆహ్లాదాన్ని కలుగజేస్తుంది. ఇందుకోసం గూగుల్‌ ప్లే లేదంటే యాప్‌ స్టోర్‌ ద్వారా వాట్సాప్‌ను ఆరంభించుకోవాలి. గ్రూపు లేదా వ్యక్తిని మొదట ఎంపిక చేసుకోవాలి. వివిధ వాల్‌పేపర్లు ప్రత్యక్షమవుతాయి. వాటిలో కావాల్సింది ఎంపిక చేసుకుని మొత్తం చాట్‌ కనులకు విందుగా మలుచుకోవచ్చు. ఇది ఒక చాట్‌కు చేసే ఏర్పాటు. అదే అన్నింటికీ అన్వయించుకోవచ్చు. లేదంటే చాట్‌ను బట్టి నేపథ్యం షేడ్‌ను మార్చుకోవచ్చు. లైట్‌, డార్క్‌ షేడ్‌లతో అందంగా మలుచుకునే వెసులుబాటు కూడా ఉంది. 

Updated Date - 2020-12-05T05:47:59+05:30 IST